సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొందరు సెలబ్రెటీలు.. అతిగా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకుంటారు. అనవసర విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో పడుతుంటారు. ఇక ఇటీవల కొందరు హీరోయిన్స్ అభిమానులతో దురుసుగా ప్రవర్తించి విమర్శలకు గురవుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుంది. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదు కాగా.. పరారీలో ఉన్నట్లు సమాచారం. కానీ ఆమె ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా..
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
ఇవి కూడా చదవండి
మలయాళీ సినిమాల్లో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ లక్ష్మీ మీనన్. 2011లో విడుదలైన రఘువింతే స్వాంతం రసియా అనే సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మలయాళంతోపాటు తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది శబ్దం సినిమాతో అలరించింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిజ జీవితంలో ఆమె రౌడీలా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..
ఆగస్ట్ 24న రాత్రి తన స్నేహితులతో కలిసి ఓ రెస్టో బార్ కు వెళ్లింది లక్ష్మీ మీనన్. అక్కడ కొందరు ఐటీ ఉద్యోగులతో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తమ కారులో ఎక్కించుకుని బెదిరిస్తూ.. బూతులు తిడుతూ హింసించారు. ఆ తర్వాత ఆమె మరో చోట విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత సదరు బాధితురాలు ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించగా.. గొడవకు కారణంగా లక్ష్మీ మీనన్ పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేశారు. నటి కోసం ప్రయత్నిస్తుండగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. దీంతో ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..