Site icon Desha Disha

Kejriwal Shocks Congress: బీహార్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు కేజ్రివాల్ షాక్.. ఈ ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెబుతారా?

Kejriwal Shocks Congress: బీహార్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ కు కేజ్రివాల్ షాక్.. ఈ ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెబుతారా?

Kejriwal Shocks Congress: బీహార్ రాష్ట్రానికి జరిగే శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ముఖ్యంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా బీహార్ లో తిష్ట వేశారు. ఆయన అక్కడ తన సోదరి ప్రియాంక గాంధీ తో కలిసి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఓటు దొంగ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది

బీహార్ రాష్ట్రానికి పిలిపించుకొని..

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీహార్ కు పిలిపించుకొని.. రాహుల్ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు.. ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో తెలియదు గానీ.. జాతీయ మీడియాలో మాత్రం రాహుల్ చేస్తున్న యాత్ర విస్తృతమైన ప్రచారంలో ఉంటున్నది. బీహార్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఆయనకు గండి కొట్టడానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

మొన్నటిదాకా ఇండియా కూటమిలోనే..

అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటిదాకా ఇండియా కూటమిలోనే ఉండేది. ఎప్పుడైతే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తేడాలు వచ్చాయో.. అప్పటినుంచి ఆప్ ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసింది. తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా బీహార్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు దేశ రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నాయి..

కాంగ్రెస్ కాంప్రమైజ్ అయింది

” పరిస్థితులు చూడబోతే బిజెపి కాంగ్రెస్ మధ్య పొత్తు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు మూతపడింద నిపిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి ఒకరు కూడా జైలుకు వెళ్లలేదు. ఫేక్ కేసులలో మేము జైలు శిక్ష అనుభవించాం. 2 జి, బొగ్గు కుంభకోణాల కథ దాదాపు ముగిసినట్టే. కాంగ్రెస్ చాలా విషయాలలో కాంప్రమైజ్ అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కేవలం వారి వ్యక్తిగత రక్షణకు మాత్రమే తోడ్పడుతోంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కచ్చితంగా వారు న్యాయమైన తీర్పు ఇస్తారని” అరవింద్ వ్యాఖ్యానించారు..

దేశ వ్యాప్తంగా చర్చ

అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో రాహుల్ బిజెపిని ఒక ఆట ఆడుకుంటున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నారు. ఇలాంటి క్రమంలో రాహుల్ గాంధీని కార్నర్ చేసి అరవింద్ విమర్శలు చేయడం.. అది కూడా కీలక విషయాలను ప్రస్తావించడంతో కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అరవింద్ చేసిన వ్యాఖ్యలు బీహార్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది. అన్నట్టు అరవింద్ పార్టీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

Exit mobile version