Site icon Desha Disha

IPS And IAS Officers: జగన్ అధికార గణానికి గుణపాఠం!

IPS And IAS Officers: జగన్ అధికార గణానికి గుణపాఠం!

IPS And IAS Officers: ఎవరినైనా ప్రముఖులను అరెస్టు చేసినప్పుడు.. వారి కేసు విచారణ చేపట్టినప్పుడు ఆ అధికారి పేరు మార్మోగిపోతుంది. అప్పట్లో జగన్ ( Y S Jagan Mohan Reddy)అక్రమ ఆస్తుల కేసులను విచారణ చేపట్టిన సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పేరు మార్మోగిపోయింది. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. అయితే ఆయన పదవీ విరమణ చేసి హాయిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వ పరిధిలో పని చేశారు కనుక. అయితే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసే అధికారులు మాత్రం హాయిగా ఉండడానికి వీలులేదు. ఎందుకంటే వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించాలి. ఇలా పాటించిన వారు రాజకీయ ప్రత్యర్థులకు శత్రువులే. ఇలా చాలామంది మూల్యం చెల్లించుకున్నారు కూడా. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టింది. డిజిపి స్థాయికి వచ్చిన ఆయనపై లేనిపోని ఆరోపణలు మోపి పక్కకు తప్పించింది. అంతెందుకు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హురాలైన శ్రీ లక్ష్మీని సైతం లూప్ లైన్ లో చేర్చారు. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఒక గుణపాఠమే.

Also Read: విశాఖలో పవన్ పెద్ద గేమ్ ప్లాన్!

* సుప్రీం ఆదేశాలతో సరెండర్..
తాజాగా సీనియర్ ఐపిఎస్ అధికారి సంజయ్( senior IPS officer Sanjay ) అరెస్ట్ అయ్యారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలన్న ఆలోచన చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. తిరిగి కోర్టు లొంగిపోమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులకు లొంగిపోక తప్పలేదు. అయితే వైసిపి హయాంలో సిఐడి డీజీగా పనిచేశారు సంజయ్. 2023 సెప్టెంబర్ నెలలో మాజీ సీఎం చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడంలో సంజయ్ పాత్ర ఉంది. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చి.. కేసులు కట్టి.. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఏకంగా అప్పట్లో ఈ కేసు పై ప్రెస్మీట్లు పెట్టి మరి మాట్లాడారు. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా వ్యాఖ్యలు చేశారు. కానీ కాలం ఒకేలా ఉండదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు అదే అధికారానికి బలయ్యారు ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్.

* అసలు ఆధారాలు లేని కేసులో..
చంద్రబాబుపై( CM Chandrababu) ఆధారాలు లేని కేసులు పెట్టి ఇరికించారు. మరి అటువంటి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఊరుకుంటారా? అందుకే ఇప్పుడు సంజయ్ కుమార్ వైసీపీ హయాంలో సిఐడి డిజి హోదాలో చేసిన అవినీతిని పట్టుకున్నారు. అంతకుముందు అగ్నిమాపక శాఖలో కూడా ఆయన చేతివాటం ప్రదర్శించారు. అయితే ఓ మాజీ సిఐడి డీజీ అవినీతి కేసులో అరెస్టు కావడం సంచలనమే. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు సంజయ్. ఆపై ఆధారాలు లేకుండానే ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసి జైల్లో ఉంచగలిగారు. కానీ అధికారం తారుమారు అయితే పరిస్థితి ఎంత దాకా వెళ్తుందో ఆయన అంచనా వేయలేకపోయారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లి.. ఇంతకాలం అరెస్టు కాకుండా సంజయ్ తప్పించుకోగలిగారు. చంద్రబాబు కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతోపాటు నాలుగు వారాల్లోగా ఏసీబీకి లొంగిపోవాలని ఆదేశించింది. వేరే గత్యంతరం లేక సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.

* కనీసం స్పందించని జగన్..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రెచ్చిపోయిన సంజయ్ లాంటి అధికారులకు ఇది ఒక గుణపాఠమే. ఒక అధికారిగా ఉంటూ జైలుకు వెళ్తే సమాజంలో గౌరవ ప్రతిష్టలు మంట కలిసి పోతాయి. సంజయ్ వంటి అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని జలరేగిపోయినందుకు.. ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పడం లేదు. కానీ అప్పుడు వారిని వాడుకున్న జగన్ ఇప్పుడు ఆదుకోవడానికి రావడం లేదు. జగన్ అవినీతికి బలయ్యారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ నుంచి ఆమెను ఏపీకి రప్పించారు జగన్. కానీ ఇప్పుడు అదే శ్రీ లక్ష్మీపై జగన్ సన్నిహితుడు కరుణాకర్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అందుకే అంటారు చేసుకొన్నోళ్లకు చేసుకున్నంత మహదేవ అని. జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికిన ఈ అధికారులంతా మూల్యం చెల్లించుకుంటున్నారు

Exit mobile version