Site icon Desha Disha

Heavy Rainfall : దేశవ్యాప్తంగా వానలే వానలు

Heavy Rainfall : దేశవ్యాప్తంగా వానలే వానలు

దేశ వ్యాప్తంగా ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిం చింది. ఉత్తరాఖండ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. చమోలీ, భా గేశ్వర్, పథోరాగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఉత్తర కాశీ, తెహ్రీ గర్వాల్, రుద్రప్రయాగ్, హరిద్వార్, అల్మోరా, నైనీతాల్ ఉదంసింగ్ నగర్ కు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. సోలన్, సిర్మౌర్ ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పంజాబ్లోని గురుదాస్పుర్, పఠాన్ కోట్ జిల్లాలకు భారీ వరద ముంపు ఉందన్న హెచ్చరికలతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర అన్ని విభాగాల సిబ్బందిని మోహరించారు. గడిచిన రెండు రోజుల్లో 2 వేలకు పైగా బాధితులు ను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు. హర్యానా మోస్తరు వానలకు అవకాశం ఉందని యహునానగర్, అంబాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నిన్న యమునా నది 204.5 మీటర్ల మార్క్ను దాటింది. ఇవాళ రెండో రోజు కూడా ప్రమాద స్థాయిలోనూ ప్రవహిస్తుందని అధికారులు తెలిపారు. ఇక దక్షిణాది విషయా నికొస్తే కోస్తా కర్నాటక, ఏపీ, తెలంగాణతో పాటు సెంట్రల్ మహారాష్ట్ర, చత్తీస్గఢ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Exit mobile version