Clove Side Effects: గర్భిణీలు లవంగం మొగ్గలు పొరబాటున కూడా ముట్టుకోకూడదు.. ఎందుకంటే?

Clove Side Effects: గర్భిణీలు లవంగం మొగ్గలు పొరబాటున కూడా ముట్టుకోకూడదు.. ఎందుకంటే?

లవంగం దాదాపు ప్రతి ఇంటిలో కనిపించే ఒక సుగంధ ద్రవ్యం. లవంగాలు ఆహార రుచి, వాసనను రెట్టింపు చేయడమే కాకుండా, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే లవంగాలను ఎల్లప్పుడు సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటి అధిక వినియోగం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీకావు. ఇవి అనేక వ్యాధులకు దివ్యౌషధం. కానీ ఎక్కువగా లవంగాలు తీసుకుంటే మాత్రం సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి లవంగం తినడానికి సరైన సమయం ఏమిటో? ఎలా తీసుకోవాలో? ఇక్కడ తెలుసుకుందాం..

లవంగాలలో యూజెనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనాలు సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. ముఖ్యంగా పంటి నొప్పి, తలనొప్పి సమయంలో లవంగాల నూనెను పూయడం లేదా లవంగాలను నమలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు సమస్యలలో లవంగాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఇవి గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. భోజనం తర్వాత ఒకటి లేదా రెండు లవంగాలను నమలడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. లవంగాలలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, శ్వాసను తాజాగా ఉంచుతాయి. అందుకే లవంగాలను అనేక టూత్‌పేస్టులలో ఉపయోగిస్తారు.

లవంగాలను అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు, ఆమ్లత్వం, అలెర్జీలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ సమయంలో వైద్యుల సలహా మేరకు మాత్రమే లవంగాలు తినాలి. ఎందుకంటే అవి గర్భాశయానికి ముప్పు తలపెడతాయి. లవంగాల నూనెను చర్మానికి నేరుగా పూయడం వల్ల చికాకు కలుగుతుంది. దీన్ని ఎల్లప్పుడూ మరొక నూనెతో కలిపి వాడాలి. అలాగే, పూసే ముందు ప్యాచ్ టెస్ట్ చాలా అవసరం. లవంగాలు రక్తాన్ని పలుచన చేస్తాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకునేవారు, ఇప్పటికే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు లవంగాలు తినడం మానేయాలి. వైద్యుల సలహాతో మాత్రమే వీటిని తీసుకోవాలి. లవంగాలను ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో మాత్రమే ఆహారంలో తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలు సరిపోతాయి. వీటితో టీ తాగవచ్చు. భోజనం తర్వాత మౌత్‌ రిఫ్రెషనర్‌గా ఒకటి నోట్లో వేసుకుని నమలవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

[

Leave a Comment