బాపట్ల జిల్లా పర్చూరు మండలం గొల్లపూడికి చెందిన గంగాధర్ పుట్టుకతోనే దివ్యాంగుడు.. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పోసపాడుకు చెందిన శిరీష కూడా దివ్యాంగురాలే.. వీరిద్దరూ మూడేళ్ల క్రితం దివ్యాంగుల సమావేశంలో కలిశారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ చదువుకోలేదు. అయితే దివ్యాంగుల పెన్షన్ వస్తుంది. దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.. తరుచూ ఇద్దరూ వివిధ సమావేశాల్లో కలుసుకునే వారు. దీంతో ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ వేరు వేరు కులాలు కావడం.. దివ్యాంగులు కావడంతో పెళ్లి చేసుకునేందుకు మొదట తటపటాయించారు. అయితే కొద్దీ కాలం తర్వాత ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకొని కలిసి జీవించాలనుకున్నారు. పెళ్లి చేసుకుందామన్న ఆలోచనకు వచ్చారు. అయితే ఇద్దరూ కులాలు ఒకటి కాకపోవడంతో గంగాధర్ పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. గంగాధర్ తల్లిదండ్రులకు మూడెకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆందోళన చెందారు. తర్వాత ఇద్దరూ కలిసి బాపట్ల జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడైన చల్లా రామయ్య వద్దకు వచ్చారు. వారి ఆలోచనలను రామయ్యకు చెప్పారు. రామయ్య కూడా ఇద్దరూ పెళ్లి చేసుకొని కలిసి జీవించాలని ప్రోత్సహించాడు. దీంతో పెద్దలను ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని ఇద్దరి నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరూ కలిసి గురువారం బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. అదే సమయంలో చల్లా రామయ్యతో పాటు మరికొంతమంది దివ్యాంగులకు అక్కడికి చేరుకున్నారు. స్నేహితుల సందడి మధ్య గంగాధర్.. శిరీష మెడలో మూడుముళ్లు వేశాడు. అనంతరం అందరూ ఆ జంటను ఆశీర్వదించారు. పట్టణ పోలీసులకు తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని తెలియజేశారు. దివ్యాంగులు ప్రేమ వివాహం చేసుకున్నారని తెలుసుకున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గ్రుహోపకరణాలు, ఇతర వస్తువులు, కొత్త దుస్తులను తహసీల్దార్ సలీమా చేతుల మీదుగా అందించారు. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్న దివ్యాంగులను పలువురు అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..