
డయాబెటిస్ ఉన్నవారు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే వారి రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది భోజనం తర్వాత కొద్దిసేపు నడవమని చెబుతారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అలాంటి సందర్భంలో, భోజనానికి ముందు నీరు తాగడం ఒక మంచి పరిష్కారం.
ఎలా పని చేస్తుంది..?
నీరు నేరుగా మందులా పనిచేయదు. కానీ ఇది మన శరీరంలోని వ్యవస్థలను చురుకుగా ఉంచి.. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం, గ్లూకోజ్ నియంత్రణ కోరుకునే వారికి ఇది ఒక ఉపయోగకరమైన అలవాటు.
నీరు తాగే సరైన విధానం
కొందరికి భోజనం ముందు లేదా భోజనం సమయంలో నీరు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయని అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. పరిశోధనల ప్రకారం.. నీరు జీర్ణక్రియను సులభం చేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని సులభంగా విడగొట్టి.. శరీరానికి శక్తిని అందేలా చేస్తుంది.
అయితే GERD (యాసిడ్ రిఫ్లక్స్) లేదా ఇతర కడుపు సమస్యలు ఉన్నవారు.. అలాగే కిడ్నీ లేదా గుండె జబ్బులు ఉన్నవారు ఎక్కువ నీరు తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
నీరు తాగడానికి సరైన సమయం
భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే మంచిది. దీని వల్ల ఆకలి తగ్గి తక్కువగా తింటారు. అలాగే ఇది రోజంతా మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సోడా, పండ్ల రసాలు, చక్కెర కలిపిన డ్రింక్స్ లకు బదులుగా కేవలం సాదా నీరు మాత్రమే తాగాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగితే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.
నీరు తాగడం వల్ల లాభాలు
- ఆకలిని తగ్గిస్తుంది.
- భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగకుండా చూస్తుంది.
- జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయం చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
[