
శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి.. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కానీ, లివర్‌లో ఉన్న మురికిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేలా మనం కొన్ని సహజ నివారణలను అవలంభించవచ్చు.. కొన్ని డిటాక్స్ డ్రింక్స్ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అలాంటి వాటిలో అల్లం – పుదీనా నీరు ఒకటి.. అల్లం, పుదీనా తైకగ కాలేయం నుండి మురికిని తొలగించడమే కాకుండా, అనేక ఇతర ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన పానీయం.. అంటూ పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. అల్లం – పుదీనా రెండూ వాటి ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. అల్లం-పుదీనా కలిపితే, వాటి ప్రభావం మరింత పెరుగుతుందని.. ప్రతిరోజూ వీటితో తయారు చేసిన ఈ డ్రింక్ తాగడం వల్ల మీ లివర్ లోపలి నుంచి శుభ్రమవుతుందని పేర్కొంటున్నారు.
అల్లం – పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు..
అల్లం: ఇందులో జింజెరాల్ మరియు షోగోల్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది కాలేయంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.. దానిని దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేసే యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది.
పుదీనా: పుదీనాలోని మెంథాల్ జీర్ణవ్యవస్థను శాంతపరుస్తుంది. ఇది కాలేయంలో పిత్త ఉత్పత్తిని పెంచుతుంది.. ఇది కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి, కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి..
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అల్లం – పుదీనా నీరు తాగడం వల్ల మీ శరీరంపై అనేక సానుకూల ప్రభావాలు ఉంటాయి:
లివర్ క్లీన్: ఈ పానీయం లివర్‌లో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు – విటమిన్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.. వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది: ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.. వేసవి రోజుల్లో తాజాదనాన్ని ఇస్తుంది.
అల్లం-పుదీనా నీటిని ఎలా తయారు చేయాలి?
అవసరమైన పదార్థాలు:
కొంచెం అల్లం ముక్క
10-15 తాజా పుదీనా ఆకులు
1 గ్లాసు నీరు
సగం నిమ్మకాయ రసం
ఒక చిటికెడు నల్ల ఉప్పు
తయారీ విధానం:
ముందుగా, ఒక పాత్రలో నీటిని మరిగించి, అల్లం ముక్కలు, పుదీనా ఆకులు వేయండి. బాగా మరిగిన తర్వాత.. ఆ నీటిని వడకట్టి ఒక గ్లాసులో పోయాలి. మీకు కావాలంటే, మీరు దానికి నిమ్మరసం – నల్ల ఉప్పును జోడించవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[