యూట్యూబ్ లో ప్రైవేట్ సాంగ్స్ చేస్తే ఇన్ని కోట్లు వస్తాయా..?

Ranu Bombai Ki Ranu Song Income: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో చాలామంది హీరులు మంచి విజయాలను సాధిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రేక్షకులకు చాలా రకాలుగా ఎంటర్ టైన్ మెంట్ దొరకడంతో వాళ్లు సోషల్ మీడియాలో సైతం రీల్స్ లాంటివి చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ రోజుల్లో ఏది చేసినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ భారీ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ఇక దానికి తోడుగా భారీ రేంజ్ లో డబ్బులు కూడా సంపాదిస్తుండడం విశేషం…ఇక రీసెంట్ గా ‘రాను బొంబాయికి రాను’ అనే సాంగ్ తో మంచి ఫేమ్ ను సంపాదించుకున్న రాము రాథోడ్ రీసెంట్ గా మరో సాంగ్ ని రిలీజ్ చేశాడు. అయితే ఆయన రాను బొంబాయి కి రాను అనే ఒక్క సాంగ్ తోనే కోటి రూపాయలు సంపాదించానని తను ఓపెన్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు.

Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది

ఐదు లక్షలు పెట్టి సాంగ్ తీసి కోటి రూపాయలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సాంగ్ తో భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే అతను ప్రస్తుతానికి ఒక విల్లాతో పాటు ఒక కార్ ను కూడా కొనుక్కున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ అనేది ఎప్పుడు వచ్చింది అనేది కాదు సక్సెస్ వచ్చిందా? లేదా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్…దాంతో పాటుగా ఇప్పుడు ఆయనతో సాంగ్స్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు సైతం ఎగబడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది అంతా చూసిన ప్రేక్షకులు సైతం ప్రైవేట్ సాంగ్స్ చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయా అంటూ భారీ రేంజ్ లో కలెక్షన్స్ ని సంపాదించవచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఏది ఏమైనా ఈ సాంగ్ అతని జీవితాన్ని మార్చేసిందనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే మరికొంతమంది సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్లు సైతం ఈ పాటను తమ సినిమాలో వాడుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సాంగ్ ను తమ సినిమాలో పెట్టుకోవడానికి రాము రాథోడ్ అనుమతిని ఇస్తాడా? దానికోసం ఆయన ఎంత మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

Leave a Comment