ఈ రోజుల్లో అందరూ హెల్త్ కాన్షస్గా ఉంటున్నారు. తమ డైట్లో తప్పకుండా పండ్లు చేర్చుకుంటున్నారు. పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. జామకాయ కూడా అంతే. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీకి మంచి రక్షణ ఇస్తాయి.
ఎవరు తినకూడదు..?
జామకాయ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ బాగా జరుగుతుంది. కానీ ఈ ఫ్రూట్ అందరికీ సరిపోదు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని తింటే సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
కిడ్నీ సమస్యలున్నవారు
జామకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది నరాలకు, కండరాలకు శక్తిని ఇస్తుంది. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా జామకాయ తింటే కిడ్నీలపై ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది. అందుకే వాళ్ళు లిమిటెడ్గా తినడం లేదా పూర్తిగా మానేయడం మంచిది.
డైజెస్టివ్ సమస్యలు ఉన్నవారు
జామకాయలోని హై ఫైబర్ డైజెషన్కు హెల్ప్ చేస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. కానీ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా ఇతర కడుపు సమస్యలు ఉన్నవాళ్లకు ఇది సరికాదు. ఎక్కువ ఫైబర్ వల్ల గ్యాస్, విరేచనాలు వంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది.
ఎలా తినాలి..?
న్యూట్రిషనిస్ట్ చెప్పినదాని ప్రకారం.. రోజుకు ఒక్క పండిన జామకాయ మాత్రమే తినాలి. బాగా పండిన జామ తినడం వల్ల డైజెషన్ ఈజీగా జరుగుతుంది. అయితే జామకు బదులుగా బొప్పాయి తినడం మంచిదని కొందరు సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిలో కూడా ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. జామకాయ చాలా మంచిదే అయినా.. మీ హెల్త్ కండిషన్ బట్టి తినడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
[