Site icon Desha Disha

మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నం తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.. – Telugu News | Health benefits of eating rice in breakfast details here

మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నం తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.. – Telugu News | Health benefits of eating rice in breakfast details here

ఉదయాన్నే అల్పహారం కాకుండా చాలా మంది డైరెక్ట్‌గా అన్నమే తింటూ ఉంటారు. అయితే ఇలా మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో బియ్యంతో చేసిన అన్నం తినటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటంటే.. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నం తినడం వల్ల కొందరికి మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు ఉదయాన్నే అన్నం తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇలా మార్నింగ్‌ బ్రెక్‌ఫాస్ట్‌లో అన్నం తినటం వల్ల లాభాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు.

ఉదయాన్నే అన్నం తినటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్నే లిమిట్ గా అన్నం తినడం మంచిది. అన్నం తీసుకోవడం వలన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవచ్చు. దాంతో పాటుగా ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు. అన్నం తింటే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. అలాగే కణాలని దెబ్బతీస్తే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

అన్నం కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి సహాయపడతాయి. అలాగే రోజంతా యాక్టివ్​గా ఉంచుతుంది. రోజంతా పనిచేయడానికి శక్తి లభిస్తుంది. అన్నంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల DNA ను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది. మెదడుకు శక్తిని అందించే గ్లూకోజ్​కు అన్నం బెస్ట్​ ఆప్షన్​. బ్రేక్​ఫాస్ట్​లో అన్నం తినడం వల్ల మీరు మరింత ఏకాగ్రతతో, స్పష్టంగా ఆలోచించగలరని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఉదయం పూట అన్నం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నంలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నం తినేవాళ్లు మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరిగా సమయానికి తినాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే అల్పాహారాన్ని కాస్త హెవీగా తీసుకోవాలి. రాత్రి ఆలస్యంగా తినడం మానుకోవాలి. ఉదయాన్నే త్వరగా తినాలి.. ఇలా వీటిని ఫాలో అయితే హెల్తీగా ఉండొచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Exit mobile version