Site icon Desha Disha

భారీ వర్షాలపై కెసిఆర్‌ ఆందోళన

భారీ వర్షాలపై కెసిఆర్‌ ఆందోళన

– Advertisement –

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అధినేత కెసిఆర్ సూచించారు.

– Advertisement –

Exit mobile version