Site icon Desha Disha

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండడం వంటి కారణాలు ఆజ్యం పోశాయి. ముఖ్యంగా బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 24,500 స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర ఆవిరై రూ.445 లక్షల కోట్లకు చేరింది.

The post భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు appeared first on Navatelangana.

Exit mobile version