Site icon Desha Disha

‘బిగ్ బాస్ 9’ హౌస్ సెట్ ఎంత అందంగా ఉందో చూసారా..?

‘బిగ్ బాస్ 9’ హౌస్ సెట్ ఎంత అందంగా ఉందో చూసారా..?

Bigg Boss 9 house set: త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కూడా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. కారణం సామాన్యులు ఈ షోలోకి వస్తున్నారు అనే. వీళ్లంతా టాప్ సెలబ్రిటీలతో ధీటుగా పోటీ పడనున్నారు. మరి ఈ సీజన్ లో సామాన్యుడు గెలుస్తాడా? అనేది ప్రస్తుతం ఉత్కంఠ ని కలిగించే అంశం. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి 5 మంది సామాన్యులను హౌస్ లోకి పంపే ప్రక్రియలో భాగంగా అగ్ని పరీక్ష షో ని నిర్వహించిన సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుండి ఈ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.

అయితే ఈసారి బిగ్ బాస్ షో లో రెండు హౌస్లు ఉంటాయని నాగార్జున ప్రోమో ద్వారా తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ రెండు హౌస్లు ఎలా ఉండబోతున్నాయి?, ఒక హౌస్ లో సామాన్యులు, మరో హౌస్ లో సెలబ్రిటీలు ఉంటారా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. రెండు వేర్వేరు హౌస్లు ఉంటే ఎలా?, ఒక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మరో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధం లేకపోతే టాస్కులు ఎలా ఆడుతారు?, ఎంటర్టైన్మెంట్ ఎలా వస్తుంది?, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే రెండు హౌస్లు ఉన్నంత మాత్రానా ఒకరికి ఒకరు కనెక్షన్ లేని విధంగా అసలు ఉండదట. డూప్లెక్స్ హౌస్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంది కదా?, ఆ విధంగానే ఉంటుందట ఈ హౌస్. కొంతమంది ఇంటి పైన ఉండే గదుల్లో ఉంటారు, మరికొంతమంది హాల్ భాగం లో ఉండే గదుల్లో ఉంటారు.

వీళ్లకు లిఫ్ట్ కూడా ఉంటుందట. అంతే కాదు, భోజనం, బ్రేక్ ఫాస్ట్ అందరూ ఒకే చోటకి వచ్చి చేయాలట. అదే విధంగా టాస్కులు కూడా అందరిని కలిపి ఒకే ప్రాంతం లో నిర్వహిస్తారట. ఈ హౌస్ కి సంబంధించిన నిర్మాణం మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం హౌస్ లో AC సరిగా పనిచేస్తుందా? లేదా?, కరెంటు ఎర్తింగ్ సరిగా ఉందా లేదా?, హౌస్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా? వంటివి తెలుసుకొని సరిదిద్దుకోవడానికి బిగ్ బాస్ టీం కి సంబంధించిన వాళ్ళు హౌస్ లోనే నిద్ర చేస్తున్నారట. ఈ సీజన్ కి మాత్రమే కాదు, ప్రతీ సీజన్ ప్రారంభానికి ముందు వాళ్ళు ఈ టెస్టింగ్ చేస్తుంటారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సీజన్ కి సంబంధించి ఇంకా ఎలాంటి విశేషాలు రాబోతున్నాయి అనేది.

Exit mobile version