Nivetha Pethuraj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నివేదిత పేతురాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అల్లు అర్జున్ తో కలిసి చేసిన అలా వైకుంఠపురంలో సోనియాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక రామ్ తో రెడ్ సినిమాలో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఆమె చేసిన ప్రతి పాత్ర ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టిందే కావడం విశేషం… ఆమె రీసెంట్ గా కొన్ని సినిమాలను చేస్తున్నప్పటికి తన ప్రైవేట్ లైఫ్ గురించి మాత్రం ఆమె ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఆమె ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఆమె తన లవర్ అయిన రజిత్ ఇబ్రాన్ తో కలిసి ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలనైతే షేర్ చేసింది. ఇక దాంతో ఆమె తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను మించిన శ్రీలీల గొప్పతనం!
ప్రస్తుతం ఆమె రజిత్ ఇబ్రాన్ తో ప్రేమలో ఉన్నట్టుగా తెలియజేశారు. ఇక ఇబ్రాన్ కి చాలా బిజినెస్ లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం టాప్ బిజినెస్ మాన్ గా కొనసాగుతున్న తను నివేదిత పేతురాజుని సైతం చాలా ఇష్టపడుతున్నారు. మరి వీళ్ళిద్దరి ఇళ్లల్లో కూడా వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని తెలియజేశారు. ఇద్దరి ఇంట్లో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తొందరలోనే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఎప్పుడు పెళ్లి ఉండబోతుందనే దానిమీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తొందరలోనే వీళ్ళిద్దరూ ఒకటవ్వబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికైనా నివేదిత పేతురాజు కమిట్ అయిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.
మరి ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఆమె మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేస్తారా? లేదంటే పెళ్లి తర్వాత సినిమాలను చేసే ఆలోచనను మానుకుంటారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగినా కూడా ఈమె చేసిన పాత్రలకి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే వచ్చింది. ఇక దాంతోనే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నటిగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతోంది…