Site icon Desha Disha

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతున్న ఇన్‌ఫ్లో (అందుతున్న నీటి ప్రవాహం), ఔట్‌ఫ్లో (విడిచిపెడుతున్న నీటి ప్రవాహం) రెండూ సుమారు 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉన్నాయని ఆయన వివరించారు.నిరంతర వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వరద ముప్పు దృష్ట్యా పొంగిపొర్లే వాగులు, వంకలు, కాలువలను దాటే ప్రయత్నం చేయరాదని స్పష్టంగా సూచించారు.

Exit mobile version