Site icon Desha Disha

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి దారేది.? – OkTelugu

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి దారేది.? – OkTelugu

People Media Factory Losses: ప్రస్తుతం భారీ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న ప్రొడక్షన్ హౌజ్ లలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి…ఈ బ్యానర్ ను స్థాపించిన చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలను పూర్తి చేశారు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి గత కొన్ని రోజులుగా వస్తున్న సినిమాలేవి కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈ సంస్థ భారీ నష్టాలను చవిచూస్తోంది. గత సంవత్సరం 100 కోట్ల నష్టాన్ని చవి చూసిన ఈ బ్యానర్ ఇప్పుడు రాబోయే సినిమాల మీద చాలా ఆశలైతే పెట్టుకుంది. ముఖ్యంగా తేజ సజ్జా హీరోగా వస్తున్న మీరాయ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా మీద భారీ బడ్జెట్ ను కూడా కేటాయించారు.

Also Read: ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను మించిన శ్రీలీల గొప్పతనం!

మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి వాళ్ళ సత్తాను చాటుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మాత్రం భారీగా డీలా పడిపోవాల్సిన పరమాదమైతే ఉంది. ఇక దీంతో పాటుగా ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే ఇక వాళ్ళ బ్యానర్ కు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఏ రేంజ్ లో ఆడినా కూడా ఈ రెండు సినిమాల వల్ల వాళ్ళ బ్యానర్ యొక్క స్థాయి కూడా పెరుగుతుందని వారు భావిస్తున్నారు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాలను భారీ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు…ఇక ఈ సినిమాకు ఇతర భాషల నుంచి వివిధ ప్రొడక్షన్ సంస్థల సహకారమైతే అందుతోంది…

ఇప్పటికే హిందీ నుంచి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…అలాగే తమిళంలో ఏజీఎస్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసింది. ఇక కన్నడలో హోంబాలే పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వాళ్ళు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం…

Exit mobile version