Site icon Desha Disha

నార్కోటిక్స్‌ కేసు.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన! – Telugu News | Mahindra University says they have zero tolerance policy and are fully cooperating with police in Narcotics case

నార్కోటిక్స్‌ కేసు.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన! – Telugu News | Mahindra University says they have zero tolerance policy and are fully cooperating with police in Narcotics case

విద్యార్థులు డ్రగ్స్‌ వాడుతున్నారని నమోదైన నార్కోటిక్స్‌ కేసుపై మహీంద్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ యాజుల మేడూరి స్పందించారు. దీనికి సంబందించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాం. ఇటీవల కొంతమంది విద్యార్థులకు నార్కోటిక్స్ కేసులో ప్రమేయమైందని వెలువడిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. మత్తుపదార్థాల వినియోగం, కలిగి ఉండటం లేదా పంపిణీ చేయడాన్ని విశ్వవిద్యాలయం ఖండిస్తుంది. మహీంద్రా యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీ ను అనుసరిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే లేదా మా విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకైనా విశ్వవిద్యాలయ నియమావళి, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయి.

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు మేము పూర్తిగా సహకరించాము. సమస్య వేగంగా, సముచితంగా పరిష్కారమయ్యేలా అన్ని విధాల సహాయాన్ని అందించాము. మా సంస్థ విలువలు, సమగ్రతను కాపాడటానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటూ, సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందగల సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఉన్నత విద్యాసంస్థగా, మత్తుపదార్థాల వినియోగ ప్రమాదాలు, చట్టపాలన ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మా విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తాము. విద్యార్థులు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుని మహీంద్రా యూనివర్సిటీ ప్రతిపాదించే విలువలను కాపాడాలని మేము కోరుకుంటున్నాము.’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Exit mobile version