Site icon Desha Disha

టాప్ 5 నుంచి అవుట్.. కళానిధి మారన్ చూడవయ్యా నీ 'జెమిని' ఎలా అయిపోయిందో?

టాప్ 5 నుంచి అవుట్.. కళానిధి మారన్ చూడవయ్యా నీ 'జెమిని' ఎలా అయిపోయిందో?

టాప్ 5 నుంచి అవుట్.. కళానిధి మారన్ చూడవయ్యా నీ 'జెమిని' ఎలా అయిపోయిందో?

Top 5 Tv Channels: బ్లాక్ బస్టర్ సినిమాలు.. అంతకు మించిన కార్యక్రమాలతో ఒకప్పుడు జెమిని తెలుగు నాట ఉర్రూతలూగించేది. అప్పటిదాకా ఏకపక్షంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈటీవీ కి చెక్ పెట్టింది. కొత్త కొత్త ధారావాహికలు.. వినూత్నమైన సినిమాలతో తెలుగు టెలివిజన్ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించేది జెమిని. కాలానికి తగ్గట్టుగా అప్డేట్ కాకపోవడంతో ఇప్పుడు జెమిని ఛానల్ టాప్ 5 లోనుంచి కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు దాని స్థానం 6. ఒక ముక్కలో చెప్పాలంటే అది లెక్కలోది కాదు. లెక్క పెట్టాల్సింది కూడా కాదు.

చానల్స్ రేటింగ్స్ లో స్టార్ మా తిరుగులేని స్థానంలో దూసుకుపోతోంది. సీరియల్స్ కు సీరియల్స్.. సినిమాలకు సినిమాలతో ఆ ఛానల్ పోటీ ఛానల్ లకు అందనంత దూరంలో ఉంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం 2400.13 తో స్టార్ మా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.. 1646.72 తో జీతెలుగు రెండో స్థానంలో కొనసాగుతోంది. 818.33తో ఈటీవీ మూడో స్థానంలో ఉంది. 603.39 తో స్టార్ మా మూవీస్ నాలుగో స్థానంలో ఉంది. 596.97 తో జెమినీ మూవీస్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి ఈ జాబితాలో రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లు టాప్ త్రీ పొజిషన్లో ఉండగా.. జెమిని మాత్రం చేతులెత్తేసింది. అసలు ఈ జాబితాలో నుంచి అది వెళ్లిపోయింది. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా జెమిని మూవీస్ ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఒకరకంగా ఇది పరిగణలోకి తీసుకోలేని స్థానమే..

జెమిని ఛానల్ సన్ నెట్వర్క్ ఆధీనంలో ఉంటుంది. ఈ నెట్వర్క్ కు అధిపతిగా కళానిధి మారన్ ఉన్నారు.. సన్ నెట్వర్క్ పరిధిలో ఉన్న సన్ ఛానల్ తమిళంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ ఛానల్ గా కొనసాగుతోంది. అంతేకాదు సన్ నెట్వర్క్ పరిధిలో ఉన్న సూర్య మలయాళం, ఉదయ కన్నడం లో తిరుగులేని స్థానంలో ఉన్నాయి. కానీ తెలుగులోకి వచ్చేసరికి జెమిని ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. కళానిధి మారన్ పట్టించుకోకపోవడం.. పోటీ చానల్స్ మాదిరిగా జెమిని నవ్యతను ప్రదర్శించలేకపోవడం వల్ల బేల చూపులు చూస్తోంది. ఇదే తీరు కొనసాగితే టాప్ టెన్ లోకి పడిపోయే ప్రమాదం కూడా లేక పోలేదు. అదే జరిగితే ఒకప్పుడు జెమినీ ఛానల్ అనేది ఒకటి ఉందని చదువుకోవాల్సి వస్తుంది.

ఇవాల్టికి జెమిని కార్యక్రమాల ద్వారా కాకుండా సినిమాల మీదనే ఆధారపడుతోంది. ఆ సినిమాలే కాస్తో కూస్తో జెమినీ ఛానల్ ను కాపాడుతున్నాయి. లేకపోతే ఆ ఛానల్ పరిస్థితి మరీ ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పటికైనా ఈ ఛానల్ పెద్దలు నష్ట నివారణ చర్యలకు దిగుతారా.. లేక అలాగే వదిలేస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version