జ‌మ్మూ మేఘ విస్పోట‌నం:పెరిగిన మృతుల‌ సంఖ్య

– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌లు రోజులుగా కురుస్తున్న‌ భారీ వర్షాలు జమ్మూకశ్మీర్‌ను ముంచెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పెను బీభత్సం సృష్టించాయి. కత్రాలోని ప్రసిద్ధమై వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది అని అధికారులు ఇవాళ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా ఆలయానికి వెళ్లే రెండు మార్గాలను మూసివేసినట్లు ప్రకటించారు.

ఆకస్మిక వరదలతో ఫోన్, ఇంటర్నెట్ సేవలు దెబ్బతినడంతో లక్షలాది మంది కమ్యూనికేషన్ లేకుండా పోయింది. భారీ వర్షాలు, వరదలతో 20-30కి పైగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్రిడ్జిలు, మొబైల్ టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది.

– Advertisement –

Leave a Comment