చైనా కంపెనీ షియోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ షాక్‌.. లీగల్‌ నోటీజులు జారీ.. ఎందుకో తెలుసా? – Telugu News | Apple and Samsung Issue Cease and Desist order to Xiaomi for Controversial Ad Campaign

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ షియోమీకి టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ భారీ షాక్ ఇచ్చాయి. తమ బ్రాండ్‌లను పోల్చుతూ షియోమీ తమ ఫోన్‌ను ప్రమోట్‌ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు రెండు కంపెనీలు షియోమీకి వేర్వేరుగా నోటీసులు జారీ చేశాయి. తమ బ్రాండ్‌లను దెబ్బతీసే ఇలాంటి ప్రకటనలను వెంటనే ఆపేయాలని నోటీసుల్లో పేర్కొన్నాయి.

అసలు ఏం జరిగిందంటే?

ఈ చైనా కంపెనీ 2025 మార్చ్‌ లో తన షియోమీ 15 అల్ట్రా మొబైల్‌ను రిలీజ్‌ చేసింది. అయితే తన బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు షియోమీ కొన్ని ప్రకటనలు చేసింది. అందులో ముఖ్యంగా ఏప్రిల్‌ ఫస్ట్‌ చేసిన ఒక పేపర్‌ యాడ్‌ ఈ కంపెనీని ఈ కష్టాలను తెచ్చిపెట్టింది. ఎందుకంటే.. ఈ యాడ్‌లో షియోమీ తన 15 అల్ట్రా మొబైల్‌ను ఆపిల్‌ 16 ప్రో మాక్స్ కెమెరాతో పోల్చింది. తమ ఫోన్‌ కన్నా.. ఆపిల్‌ కెమెరాలు బెష్ట్‌ ఫర్ఫామెన్స్‌ ఇవ్వలేవని వ్యంగంగా రాసుకొచ్చింది. అయితే షియోమీ ఆపిల్‌పై విమర్శలు చేయడం ఇదే మొదటి సారి కాదా గతంలోనూ ఇండియాలో Xiaomi 15 సిరీస్ లాంచ్ సందర్భంగా, iPhone 16 Pro Max కెమెరాను ‘క్యూట్’ అని అభివర్ణిస్తూ, దాని ఫోటోగ్రఫీ సామర్థ్య శక్తిని చూపించే ఒక ప్రింట్ ప్రకటనలో వ్యంగ్యంగా చూపించారు. ఇదే కాకుండా శాంసంగ్‌ ప్రీమింయం ఫోన్లను కూడా ఉద్దేశిస్తూ షియోమీ కొన్ని ప్రకటనలు చేసింది.

ఈ ప్రకటనలపై స్పందించిన శాంసంగ్‌, ఆపిల్‌ తయారీ సంస్థలు తమ బ్రాండ్‌ ఇమేజ్‌ డ్యామెజ్‌ చేయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తుందని.. షియోమీ కంపెనీకి వేర్వేరుగా నోటీసులు పంపాయి. వ్యాపార పోటీ పరిధిని దాడి ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని.. ఇది పక్కబ్రాండ్‌ల ఇమేజ్‌ను దెబ్బతీయడమేనని ఈ రెండు కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి పెట్టిన Xiaomi

బడ్జెట్‌ ఫ్రెండ్లీ మొబైల్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన Xiaomi, ఇండియన్‌ మార్కెట్‌లోని ప్రీమియం ఫోన్‌ల విభాగంలో తన స్థానాన్ని బలపర్చుకోవాలని చూస్తోంది. కానీ ఇండియన్‌ మార్కెట్‌లోని ప్రీమియం ఫోన్‌ల సెగ్మెంట్‌లో ప్రస్తుతం Apple, Samsung ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. Apple షిప్‌మెంట్‌ల గురించి మాట్లాడుకుంటే, 2025 మొదటి అర్ధభాగంలో కంపెనీ షిప్‌మెంట్‌లు సంవత్సరానికి 21.5 శాతం పెరిగి 59 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో iPhone 16 భారతదేశంలో అత్యధికంగా షిప్ చేయబడిన మోడల్ అని, మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో 4 శాతం వాటా ఉందని నివేదిక పేర్కొంది.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment