ఎన్టీఆర్ కి ‘శక్తి’.. తేజ సజ్జాకి ‘మిరాయి’.. అదే భయం?

Teja Sajja Mirai: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న ‘మిరాయి’ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు…ఇక మొదటి నుంచి చివరి వరకు ట్రైలర్ సినిమాలోని కంటెంట్ ను ఎస్టాబ్లిష్ చేసే విధంగానే ఉంది. విజువల్స్ కూడా ఒక హాలీవుడ్ సినిమాని చూస్తున్న రేంజ్ లో ఉన్నాయి. మరి దానికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా కథ కూడా ఉండబోతోంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తేజ సజ్జా ఈ సినిమాకి మైనస్ అవ్వబోతున్నాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి… ఎందుకంటే ఇది ఒక హెవీ కథ అతను దాన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు.

Also Read: హైపర్ ఆది.. ఎంత పనిచేస్తివి…

ఆయన ప్లేస్ లో ఎవరైనా స్టార్ హీరో ఉంటే బాగుండేది అనిపించింది. మరి మొత్తానికైతే ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని చాలా సక్సెస్ఫుల్గా నిలుపుతాను అనే ఒక కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు. ఇక విజువల్స్ ని గాని, ఆ గ్రాండీయర్ ని గాని చూస్తే బాగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికి చివరికి ఈ సినిమా ఇక ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమా మీద కూడా ఇలాంటి ఒక అంచనాలైతే ఉండేవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ట్రైలర్ మొత్తం భారీ విజువల్స్ తో నింపేశారు. ఇక అప్పట్లో ఆ సినిమా ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు కానీ అది డిజాస్టర్ అయింది. మరి ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే కూడా అలాంటి ఒక నెగెటివ్ వైట్ అయితే వస్తుంది.

సినిమా కథ బాగున్నప్పటికి విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టుగా అనిపించిన కూడా సినిమా మీద ఏదో ఒక తెలియని అసంతృప్తి అయితే కనిపిస్తుంది. మరి ఈ ట్రైలర్ ను కావాలనే అలా కట్ చేశారా? లేదంటే సినిమా కంటెంట్ అలానే ఉండబోతుందా? అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నారు అనేది…

 

Leave a Comment