Site icon Desha Disha

ఈ కన్నీటి కథ వింటే చిరంజీవికి సెల్యూట్ చేస్తారు…

ఈ కన్నీటి కథ వింటే చిరంజీవికి సెల్యూట్ చేస్తారు…

ఈ కన్నీటి కథ వింటే చిరంజీవికి సెల్యూట్ చేస్తారు…

Uttej Comments On Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా కమెడియన్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉత్తేజ్…శివ సినిమా సమయంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఉత్తేజ్ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో మంచి పేరు సాధించుకున్నాడు. ఆయన చిరంజీవికి వీరాభిమాని అనే విషయం మనందరికి తెలిసిందే. దానికి తోడుగా చిరంజీవిని అన్నయ్య,అన్నయ్య అని పిలుచుకుంటూ ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. చిరంజీవి సినిమాల్లో సైతం చాలా వరకు మంచి పాత్రలను పోషించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్నాడు… ఇక తను ఈ మధ్యకాలంలో చాలావరకు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు. అయితే ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు చేసిన సహాయం గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా ఉత్తేజ వాళ్ళ వైఫ్ గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే తనకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉందనే విషయాన్ని చిరంజీవికి తెలియజేయాలని ఉత్తేజ్ చిరంజీవి దగ్గరికి వెళ్ళాడట. అక్కడ కూర్చొని తన భార్య కి క్యాన్సర్ అని చెప్పడంతో చిరంజీవి ఓ గాడ్ అంటూ అతన్ని హగ్ చేసుకుని ట్రీట్మెంట్ ఏది కావాలంటే అది చేద్దాం నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పారట. కానీ ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా అది ముదిరిపోవడంతో ఆమె బతకడం కష్టమని చెప్పారట. ఇక దాంతో ఆమెకు ఒకరోజు మార్నింగ్ సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లరట.

Also Read: ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను మించిన శ్రీలీల గొప్పతనం!

ఇక అప్పటికే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికి ఆమె చాలా వరకు ఇబ్బంది పడుతొందట. ఇక ఉత్తేజ్ కి కూడా తను బతకడం కష్టమని తెలిసిపోయిందట…ఇక అంతలోనే డాక్టర్లు వచ్చి ఆమె ఇక లేదు అని చెప్పడంతో వెంటనే అప్పటివరకు చిరంజీవికి ఎప్పుడు ఫోన్లు చేయని ఉత్తేజ్ ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ లు మాత్రమే పెట్టేవాడట…

కానీ ఆ సిచువేషన్ లో ఉత్తేజ్ చిరంజీవికి ఫోన్ చేసి ఏడుస్తూ పద్దు ఇక లేదన్నయ్యా అని చెప్పడంతో నైట్ చిరంజీవి షూటింగ్ లో పాల్గొని మార్నింగ్ 6:00 కు వచ్చి మేకప్ తీసి ఉన్నాడట. దాంతో ఉత్తేజ్ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే నీ పక్కన ఎవ్వరు ఉన్నారు అని ఉత్తేజ్ ని అడిగితే ఎవ్వరు లేరన్నయ్య అని చెప్పగానే ఓ గాడ్ అని నేను హాస్పిటల్ కి వస్తున్నానని చెప్పి చిరంజీవి అక్కడికి వచ్చి దాదాపు 9:30 వరకు అక్కడే ఉన్నారట…

అలాగే హాస్పిటల్ బిల్లుతో పాటు ఆ 11 రోజుల కార్యక్రమం మొత్తాన్ని చిరంజీవి తన సొంత ఖర్చులతో భరించినట్టుగా చెప్పాడు. మొత్తానికైతే చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని ఉత్తేజ్ మరోసారి చెప్పడం చిరంజీవి అభిమానులను ఆనందపెడుతోంది. ఇక ఉత్తేజ్ సైతం చిరంజీవికి వీరాభిమాని అనే విషయం మనందరికి తెలిసిందే. మొత్తానికైతే ఈ వీడియోలో ఉత్తేజ్ తన భార్యను గుర్తుచేసుకొని చాలా వరకు ఎమోషనల్ అయ్యాడు…

Exit mobile version