ఆ హీరోయిన్స్ తో పెళ్లి దాకా వెళ్లిన జగపతి బాబు..

Jayammu Nischayammu Raa With Jagapathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో జగపతిబాబు ఒకరు… ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండేవి అలాగే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆయన సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అయితే ఆయనకు వీరాభిమానులుగా మారిపోయారు. ఇక ఆయన కెరియర్ లో చేసిన పెళ్లి పందిరి, మావిచిగురు, శుభలగ్నం, బడ్జెట్ పద్మనాభం లాంటి సినిమాలు అతనికి ఫ్యామిలీ మెన్ గా మంచి ఇమేజ్ నైతే సంపాదించి పెట్టాయి. ఇక గాయం, అంతఃపురం లాంటి సినిమాలు అతనిలోని ఒక మంచి నటుడిని బయటికి తీసాయి. మరి ఏది ఏమైనా కూడా కొన్ని సంవత్సరాలుగా ఆయన హీరోగా తన మార్కెట్ ని కోల్పోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు రకాల వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు జీ చానెల్ వాళ్ళు నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే నాగార్జున, శ్రీలీల లతో వచ్చిన రెండు ఎపిసోడ్లను సక్సెస్ ఫుల్ గా నిలిపాడు. ఇక ఇప్పుడు నానితో మూడో ఎపిసోడ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: ట్రంప్ మొర.. నా ఫోన్ ఎత్తవయ్యా మోదీ!

ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక అందులో జగపతిబాబు నాని మీద కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇక దానితోపాటుగా నాని సైతం జగపతిబాబు ను రివర్స్లో ఒకప్పుడు మీరు మంచి హీరో అని తెలుసు అంటూ సెటైరికల్ గా మాట్లాడుతూనే చాలా ఎఫైర్లు కూడా ఉన్నట్టుగా తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు.

ఇక దాంతో జగపతి బాబు అంతటితో ఆపేయకుండా వాటిలో కొన్ని పెళ్లిదాకా కూడా వెళ్ళాయి అంటూ కౌంటర్ ఇవ్వడంతో దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు జగపతిబాబు సౌందర్య తో చాలా మంచి సినిమా చేశాడు. అయితే వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో చాలా వార్తలైతే బయటకు వచ్చాయి.

అప్పటికి జగపతిబాబు కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండడంతో కొద్దిరోజులకి ఈ వార్తలకు చెక్ అయితే పెట్టారు. మరి ఏది ఏమైనా కూడా జగపతిబాబు సౌందర్యని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలైతే అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాయి. మరి మొత్తానికైతే ఇప్పుడు తను నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం… ఇక ఇప్పుడు తనకి ఇండియా వైడ్ గా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది…

 

Leave a Comment