Site icon Desha Disha

అప్పుడే ఓటీటీ లోకి 'వార్ 2'..ఎందులో చూడాలంటే!

అప్పుడే ఓటీటీ లోకి 'వార్ 2'..ఎందులో చూడాలంటే!

అప్పుడే ఓటీటీ లోకి 'వార్ 2'..ఎందులో చూడాలంటే!

War 2 OTT Release Date: ఈ ఏడాది ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని బాగా నిరాశకు గురి చేసిన చిత్రాల్లో ఒకటి ‘వార్ 2′(War 2 Movie). ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోలుగా నటించిన ఈ సినిమా 150 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిలించి, భారీ నష్టాలను తెచ్చిపెట్టిన ఇండియన్ సినిమాల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపుగా ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ థియేట్రికల్ రన్ ని ముగించుకున్నట్టే. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 62 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, అదే విధంగా హిందీ వెర్షన్ తో కలిపి 336 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలి. తెలుగు వెర్షన్ వసూళ్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయి కానీ, హిందీ వెర్షన్ లో ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఫ్లాప్ టాక్ తో రెండు వారాల తర్వాత కూడా ఈ మాత్రం వస్తుందంటే నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. కానీ బ్రేక్ ఈవెన్ కి ఉపయోగపడని గ్రాస్ ఎంత వస్తే ఇంకేంటి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ముందుగా యాష్ రాజ్ ఫిలిమ్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఎట్టిపరిస్థితిలోనూ నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి. అందుకే సెప్టెంబర్ 12 న విడుదల చెయ్యాలని అందుకున్నారట. దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన త్వరలోనే చేయనున్నారు మేకర్స్. గతంలో ‘వార్’ చిత్రాన్ని మేకర్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ కి అమ్మారు. కానీ వార్ 2 ని మాత్రం నెట్ ఫ్లిక్స్ కి అమ్మడం విశేషం.

థియేటర్స్ లో దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుందో లేదో చూడాలి. ఈ చిత్రం తో యాష్ రాజ్ సంస్థ తెరకెక్కించే స్పై యూనివర్స్ కి బ్రేక్ పడినట్టే అనుకోవాలి. అంతే కాదు ఈ సినిమా తో పాటు, వార్ 2 లోని ఎన్టీఆర్ క్యారక్టర్ తో ఒక ప్రత్యేకమైన సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడం తో ఆ ఆలోచనని విరమించుకున్నారు మేకర్స్ పఠాన్ కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో మొదటి నుండి మేకర్స్ ఉండేవారు. ఇప్పుడు ఆ ఆలోచన కూడా విరమించుకున్నట్టు తెలుస్తుంది. అలా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన స్పై యూనివర్స్ కి ఇలా బ్రేక్ పడింది అన్నమాట.

Exit mobile version