Site icon Desha Disha

‘అఖండ 2’ గురించి ఫ్యాన్స్ కి గుండెలు ఆగిపోయే వార్త..

‘అఖండ 2’ గురించి ఫ్యాన్స్ కి గుండెలు ఆగిపోయే వార్త..

Akhanda 2 postponed: నందమూరి అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie). బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి సినిమాకు సీక్వెల్ గా మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘అఖండ 2’ తెరకెక్కుతుంది అనే వార్త వచ్చినప్పటి నుండే ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే మేకర్స్ మొదటి నుండి ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తామంటూ డంకా బజాయించి మరీ చెప్పుకుంటూ వచ్చారు. అదే రోజున పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం ‘ఓజీ’ విడుదల అవుతుంది, అదే రోజున ఎలా ఈ సినిమా వస్తుంది?, రావడం అసాధ్యం అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పుకొచ్చాయి.

ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్త వచ్చినప్పుడల్లా మేకర్స్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సెప్టెంబర్ 25 నే వస్తున్నాం అంటూ ఖరారు చేసేవారు. మేకర్స్ అలా చెప్పడం తో అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ట్యాగ్ చేస్తూ దమ్ముంటే పోటీ కి రండి అంటూ సవాళ్లు కూడా విసిరారు నందమూరి అభిమానులు. కానీ చివరికి ఈ సినిమా వాయిదా పడింది అంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం తో నందమూరి అభిమానులకు గుండెలు ఆగినంత పని అయ్యింది. మేకర్స్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఏముందో ఒకసారి చూద్దాం. ‘అఖండ 2 చిత్రం కోసం మీరంతా ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే ఇండియా లో మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ చిత్రం గా నిల్చింది’.

‘అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి వెళ్లాయి. సినిమా స్కేల్ మరియు అంచనాలను పరిగణలోకి తీసుకొని, ఈ సినిమా కోసం అదనపు సమయం కేటాయించాలని అనుకుంటున్నాము. VFX మరియు రీ రికార్డింగ్ కి సంబంధించిన పనులు చాలా వరకు బ్యాలన్స్ ఉన్నాయి. థియేటర్ లో మీకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వడానికి క్వాలిటీ విషయం లో మేము అసలు రాజీ పడడం లేదు. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. మీకు అద్భుతమైన సినిమాని అందించడానికి మేమంతా అహర్నిశలు శ్రమిస్తున్నాము. అఖండ 2 అనేది ఒక సినిమా కాదు, సినీ ప్రియులకు ఇది ఒక పండుగ’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు.

Exit mobile version