Trump vs Modi : మోదీని బెదిరించా.. ట్రంప్‌ పిచ్చికూతలు!

Trump vs Modi : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి పిచ్చి రోజు రోజుకూ ఎక్కువవుతోంది. అవార్డు కోసం పిచ్చెక్కిపోతున్నాడు. మందు తాగిన కోతిలా గెంతులేస్తున్నాడు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆపుతానని అలస్కా వరకు వెళ్లి పుతిన్‌తో సమావేశమైన ట్రంప్‌.. తాత్కాలిక విరమణ కూడా చేయలేక పరువు తీసుకున్నారు. ప్రపంచ మొత్తం ట్రంప్‌ను చూసి నవ్వుతోంది. ఇలాంతి తరుణంలో మళ్లీ భారత్‌పై పడ్డాడు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి పిచ్చి కూతలు కూశాడు ఈ ముసలి నక్క. ఇప్పటికే భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఆపింది తానే అని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌ తాజాగా వైట్‌ హౌస్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో బెదిరించినట్లు తెలిపారు. అణు యుద్ధ ప్రమాదాన్ని గుర్తించి, రెండు దేశాలతో చర్చలు జరిపి, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు వెల్లడించారు. అయితే, ఈ వాదనలను భారత ప్రభుత్వం స్పష్టంగా ఖండించింది. దీంతో ట్రంప్‌ మరోమారు పరువు తీసుకున్నారు.

ట్రంప్‌ గాలితీసిన భారత్‌..
ట్రంప్‌ వాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం భారత్‌–పాకిస్థాన్‌ మధ్య సైనిక స్థాయి చర్చల ఫలితమని మరోమారు స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ పార్లమెంట్‌లో మోదీ–ట్రంప్‌ మధ్య ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు. అలాగే, జీ7 సదస్సు సందర్భంగా కెనడాలో మోదీ, అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరగలేదని తేల్చిచెప్పారు. భారత్‌ ఎప్పుడూ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించదని మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దీంతో ట్రంప్‌ గాలి మరోసారి తుస్సుమంది.

విపక్షానికి మరో అస్త్రం..
ఇదిలా ఉంటే ట్రంప్‌ వాదనలు భారత్‌లో విపక్షాలకు ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశాన్ని ఇచ్చాయి. విపక్షాలు ఈ వ్యాఖ్యలను ప్రభుత్వ దౌత్య వైఫల్యంగా చిత్రీకరిస్తున్నాయి. అయితే, భారత్‌ తన దౌత్య స్వాతంత్య్రాన్ని నొక్కిచెప్పడం, పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకే ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేయబడిందని స్పష్టం చేయడం ద్వారా ఈ విమర్శలను తిప్పికొడుతోంది. ట్రంప్‌ వాదనలు అమెరికా రాజకీయ వేదికలపై తన ప్రభావాన్ని చాటుకోవడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి.

Leave a Comment