కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్.. కారు లోపల హాకీ బ్యాట్లు.. ఎక్కడో పోలీసులకు డౌట్ వచ్చింది.. కట్ చేస్తే గ్రామంలో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకే… కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని… హాకీ బ్యాట్లతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీ సత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి తండాకు చెందిన సేవాలాల్ నాయక్… తన బ్లాక్ స్కార్పియో కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని… గ్రామంలో తిరుగుతున్నాడు. గతంలో అదే కారులో హాకీ స్టిక్స్ పెట్టుకొని తిరుగుతూ… గొడవలకు వెళ్లేవాడని… గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో…. తాజాగా మరోసారి గ్రామస్తులు సేవాలాల్ నాయక్ హాకీ స్టిక్స్‌తో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బ్లాక్ స్కార్పియోను ఆపి తనిఖీ చేశారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్…. అది కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరుతో ఉన్న స్టిక్కర్ ఉండడంతో… అనుమానం వచ్చిన పోలీసులు కారు డోర్ ఓపెన్ చేసి చూస్తే… రెండు హాకీ స్టిక్స్ కనిపించాయి.
గతంలో అనేకసార్లు గ్రామంలో హాకీ బ్యాట్లతో సేవాలాల్ నాయక్ గొడవలకు పాల్పడేవాడని… పోలీసులు విచారణలో తేలడంతో…. సెక్షన్ 109 కింద సేవాలాల్ నాయక్ అండ్ గ్యాంగ్‌ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని తిరుగుతున్న కారును సీజ్ చేసి… ఆర్టిఏ అధికారులకు అప్పగించారు పోలీసులు. అసలు ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ ఒరిజినలా??? లేక నకిలీయా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ని ఎందుకు కారుపై అతికించుకుని తిరుగుతున్నారు అన్నదానిపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు…