IAS Srilakshmi: జస్ట్ 21 సంవత్సరాలు.. అప్పటికే ఆమె సివిల్స్ కొట్టేసింది. మామూలుగా కాదు ఏకంగా టాపర్ గా నిలిచింది.. అదే ఏడాది ఐపీఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఉన్నత ఉద్యోగం.. తన స్థాయికి తగ్గ భర్త.. కోరుకున్న సంసారం.. ఇవన్నీ కూడా ఆమెకు అనతి కాలంలోనే లభించాయి. ఒకరకంగా ఇలాంటి జీవితం ఎవరికీ దక్కదు. కానీ ఆమె ఏ జన్మలో చేసుకుందో.. ఈ జన్మకు అడుగడుగున వరాలు లభించాయి. ఆమెను సుఖంగా ఉంచేలా చేశాయి. ఇంతవరకు సజావుగా సాగిపోయింది. కానీ ఆ తర్వాతే వైకుంఠపాళీ మొదలైంది. ఆమె జీవితం కూడా తలకిందులు అయిపోయింది.
ఆమె పేరు తెలియని వారు ఉండరు
తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్ శ్రీలక్ష్మి అనే పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే అనైతికత.. అక్రమాలు.. అడ్డగోలు వ్యవహారాలలో ఆమె తలదూర్చడం వల్ల జీవితం మారిపోయింది. 21 సంవత్సరాలకు సివిల్స్ టాపర్ అయిన ఆమె.. 45 సంవత్సరాలకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కన్నీటి సుడుల మధ్య రోజులు లెక్క పెట్టాల్సి వచ్చింది. నడవలేని స్థితిలో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.. ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి బెయిల్ లభించింది. కొలువులో చేరింది. అప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు విభజనకు గురి కావడంతో.. తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాధాన్యంగా ఉంచుకుంది.. 2019 ఎన్నికల్లో జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడంతో.. ఆయనను అభినందించడానికి వచ్చింది. వైసిపి అధినేత ద్వారా కేంద్రానికి సిఫారసు చేయించుకొని తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చింది. అప్పట్లో జగన్ ఆమెకు స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు..
అమరావతి మీద..
ఏపీ ముఖ్యమంత్రి అప్పట్లో ఆమె సేవలను మరో విధంగా ఉపయోగించుకున్నారని ఇప్పటికి టిడిపి నేతలు ఆరోపిస్తూ ఉంటారు..” అమరావతి అంటే జగన్ కు ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు. అందువల్లే రాజధాని మీద ఆమెను తన అస్త్రంగా ఉపయోగించాడు.. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని శ్రీలక్ష్మిని పురమాయించాడు. దానికి బ్యాంకులు ఒప్పుకోలేదు. మంగళగిరిలో కొంత భాగాన్ని కలుపుకొని.. అందులో బయటి వారికి అడ్డదిడ్డంగా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తే.. అమరావతి రైతులు కన్నీరు పెట్టారు. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి ముఖ్యపాత్ర పోషించారు. పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో ఒక సదస్సు పెడితే.. ఆ సదస్సులో ముఖ్యపాత్ర పోషించింది శ్రీలక్ష్మి. పెట్టుబడులు రాకపోగా.. ఐపాడ్ బృందం కిట్లు కూడా పట్టుకుపోయింది. చివరికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు.. ఇదే క్రమంలో శ్రీలక్ష్మి కోర్టు ధిక్కరణకు పాల్పడడంతో.. సామాజిక సంక్షేమ హాస్టల్ లో చాక్లెట్లు పంచి.. కోర్టు ఆగ్రహాన్ని శ్రీ లక్ష్మీ తగ్గించిందని” టిడిపి నేతలు చెబుతుంటారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత
2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని ఒక పుష్ప గుచ్చంతో ఆయన వద్దకు వెళ్ళింది. దానిని తీసుకోవడానికి బాబు నిరాకరించారు. చివరికి మంత్రి నారాయణ వద్దకు కొన్ని ఫైల్స్ పంపించింది. వాటిని ఆయన పరిశీలించకుండానే వెనక్కి పంపించారు.. వచ్చే ఏడాది ఆమెకు రిటైర్మెంట్.. ఈ లోపల పోస్టింగ్ కావాలని.. పోస్టింగ్ సాధించాలని గట్టి నిర్ణయంతో ఉంది శ్రీలక్ష్మి. ఇంతలోనే తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు దీనిని ఒప్పుకోలేదు. అదే కాదు శ్రీ లక్ష్మీ విషయంలో కేసు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు ఎక్కింది.. దీంతో శ్రీ లక్ష్మీ ఆశలు అడియాసలయ్యాయి. ఇంతలోనే వైసిపి నేత కరుణాకర్ రెడ్డి ఆమెపై అడ్డగోలుగా మొదలుపెట్టారు. తాటకి అన్నారు. అవినీతిపరురాలు.. పొగరుబోతు.. పూతన రాక్షసి.. రజియా సుల్తానా అంటూ తిట్టి పోశారు. వైసిపి లో ఉన్న నాయకులను నమ్ముకుంటే ఏ అధికారికైనా ఇలాంటి పరాభవమే ఎదురవుతుందని” టిడిపి నేతలు అంటున్నారు.
గుణపాఠం లాంటిదే
21 సంవత్సరాలకు సివిల్స్ లో టాపర్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. శ్రీలక్ష్మికి రాజ్యాంగాన్ని అవపోసన పట్టింది. కానీ తనదైన రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులకు దగ్గరయి చివరికి ఇదిగో ఇలాంటి దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్నది. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు అడ్డగోలుగా తిట్టారంటే అందులో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆమె ఎంత చింతించినా ఉపయోగం ఉండదు. ఒక రకంగా శ్రీ లక్ష్మీ లాంటి ఉదంతాలు బ్యూరోక్రాట్లకు గుణపాఠాలు. పచ్చిగా చెప్పాలంటే కేసు స్టడీ లాంటి నిష్ఠూర సత్యాలు.