
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. పలుకుబడికలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల సమస్యల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఆదాయం బాగానేఉంటుంది ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లవంటివి బాగా లాభిస్తాయి. శత్రు, రోగ, రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికిఅందుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగేకొన్ని పనులు చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేకుండా గడిచి పోతుంది. ఇంటాబయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటేబాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తిచేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందేసూచనలున్నాయి. ఆర్థికంగా ఎవరికీవాగ్దానాలు చేయవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2)
ఒకటిరెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువుల్లో పెళ్లిసంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానేఉంటుంది.
తుల (చిత్త3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు, ఆస్తివ్యవహారాలు బాగా అనుకూలంగా మారిపోతాయి. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ సమాచారం అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. పలుకుబడికలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను తగ్గించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఎవరికీ ఆర్థికంగా వాగ్దానాలు చేయవద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట1,2)
ఆదాయానికి, ఆరోగ్యానికిలోటుండదు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగాపెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లిప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో అనుకోకుండా కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ట3,4, శతభిషం, పూర్వాభాద్ర1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్లజాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. అప్పుడప్పుడూ కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. సొంత పనుల మీద ఎక్కువగా దృష్టిపెట్టడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను తేలికగా చక్కబెడతారు. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.