Site icon Desha Disha

Health Tips: ఈ 6 పండ్లు కిడ్నీలకు జీవం పోస్తాయి.. కిడ్నీ సమస్యలు పరార్‌..! – Telugu News | Health Tips: 6 fruits help to Keep Your Kidneys Healthy

Health Tips: ఈ 6 పండ్లు కిడ్నీలకు జీవం పోస్తాయి.. కిడ్నీ సమస్యలు పరార్‌..! – Telugu News | Health Tips: 6 fruits help to Keep Your Kidneys Healthy

Kidney Health: ఈ రోజుల్లో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానాన్ని బట్టి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటారు. కీడ్నీ సమస్యలు ఉంటే లక్షలాది రూపాయలు ఆస్పత్రుల్లో ఖర్చుచేయాల్సి ఉంటుంది. అది కూడా గ్యారంటి ఉండదు. కీడ్నీ సమస్యలతో మరణించిన వారు కూడా చాలా మంది ఉంటారు. అందుకే ముఖ్యంగా ఈ మూత్రపిండాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇవి మన శరీరంలోని సహజ ఫిల్టర్లు. ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఈ 6 పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..

ఫాస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి:

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఈ రోజుల్లో ఫాస్ట్‌ ఫుడ్‌కు బాగా అలవాటు పడుతున్నారు. వీటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. లేకుంటే మీ కీడ్నీలు దగ్గరపడే రోజులో ఎంత దూరంలో లేవని తెలుసుకోవాలి. ఈ ఫాస్ట్‌ ఫుడ్‌, ఆయిల్‌ ఫుడ్‌ వంటివి తీసుకోవడం వల్ల మన శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తాయి. మూత్రపిండాలు మన శరీరంలోని సహజ వడపోతలు, ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోకపోతే, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి భవిష్యత్తులో ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

పుచ్చకాయ:

మీ మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అనేక పండ్లు మీ మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి. వాటిలో మొదటిది పుచ్చకాయ. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఈ పండు వేడి రోజులలో శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

ఆపిల్:

ఆపిల్ వస్తుంది. ఈ పండులోని ఫైబర్ విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఆపిల్స్ మూత్రపిండాలను ఫిల్టర్ చేయడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడతాయి.

ఎండు ద్రాక్ష:

ఇక ఎండు ద్రాక్ష యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఎండుద్రాక్ష మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రాన్బెర్రీస్ అనేది మూత్రంలో బ్యాక్టీరియా స్థాయిని తగ్గించే ఒక పండు. తద్వారా సహజ యాంటీబయాటిక్ లాగా మూత్రపిండాలను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

స్ట్రాబెర్రీ జ్యూస్‌:

ఇక స్ట్రాబెర్రీ జ్యూస్‌ తాగడం వల్ల మూత్రంలో ఆల్కలీన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

బొప్పాయి:

అలాగే బొప్పాయి పండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ బొప్పాయి వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు కిడ్నీ వాపును నివారిస్తాయి. ఇలాంటి పండ్లను తరచుగా తీసుకుంటే కిడ్నీ సమస్యలను నివారించవచ్చంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే బిత్తరపోతారు!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఇది కూడా చదవండి: DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[

Exit mobile version