Gold Price: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వినాయక చవితికి ఒక రోజు ముందు మహిళలకు షాచిచ్చాయి. తగ్గినప్పుడు స్వల్పంగా తగ్గుతున్న బంగారం ధరలు.. పెరిగినప్పుడు మాత్రం అంతకు రెట్టింపు ధరలతో నమోదు అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. వారం రోజులుగా స్వల్పంగా తగ్గుతూ లక్ష రూపాయలకుపైగా కదలాడుతున్నాయి. ప్రస్తుతం తులం ధర కొనాలంటే లక్ష రూపాయలకుపైగానే పెట్టుకోవాల్సిందే. లక్షకు దిగువన ఉండే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు.
తాజాగా అంటే ఆగస్ట్ 26వ తేదీన సాయంత్రం 6 గంటల సమయానికి తులం పసిడిపై ఏకంగా 550 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,060 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,550 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోపై 1000 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,20,000 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ధర భారీగా ఉంది. కిలోకు రూ.1,30,000 వరకు ఉంది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Indian Currency: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కీలక ఆదేశాలు!
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ (10 గ్రాములకు):
- 24 క్యారట్స్ – 1,02,060
- 22 క్యారట్స్ -93,550
ఢిల్లీ:
- 24 క్యారట్స్ – 1,02,210
- 22 క్యారట్స్ -93,710
ముంబై:
- 24 క్యారట్స్ – 1,02,060
- 22 క్యారట్స్ -93,550
కోల్‌కతా:
- 24 క్యారట్స్ – 1,02,060
- 22 క్యారట్స్ -93,550
బెంగళూరు:
- 24 క్యారట్స్ – 1,02,060
- 22 క్యారట్స్ -93,550
చెన్నై:
- 24 క్యారట్స్ – 1,02,060
- 22 క్యారట్స్ -93,550
ఇది కూడా చదవండి: PAN Card: పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ తప్పు చేశారంటే రూ.10 వేల జరిమానా
ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు తీపి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం పాఠశాలలు బంద్!
అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానముంది. పెళ్లిళ్లు, పండగలు, ఇతర సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇక పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల సమయాల్లో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా మహిళలు పసిడి ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ప్రత్యేక సీజన్లలో బంగారానికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇక దసరా, దీపావళికి బంగారం కొనుగోలు చేస్తే మంచిదని విశ్వసిస్తుంటారు మహిళలు. ఇప్పుడు దసరా సమీపిస్తోంది. ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి