Site icon Desha Disha

Draupathi 2: చారిత్రక కథతో వస్తున్న ద్రౌపతి 2.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్.. – Telugu News | Raupathi 2 Movie First Look Released, Check Here Details

Draupathi 2: చారిత్రక కథతో వస్తున్న ద్రౌపతి 2.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్.. – Telugu News | Raupathi 2 Movie First Look Released, Check Here Details

నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ద్రౌప‌తి -2’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది వ‌ర‌కు ప‌ళయ వ‌న్నార‌పేట్టై, ద్రౌప‌తి, రుద్ర తాండ‌వం, బ‌కాసుర‌న్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన మోహ‌న్‌.జి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రిచ‌ర్డ్ రిషి, ర‌క్షణ ఇందుసుద‌న్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. న‌ట్టి న‌ట‌రాజ్ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఇంకా వై.జి.మ‌హేంద్ర‌న్‌, నాడోడిగ‌ల్ భ‌ర‌ణి, శ‌ర‌వ‌ణ సుబ్బయ్య, వేల్ రామ‌మూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గ‌ణేష్ గౌరంగ్, దివి, దేవ‌యాని శ‌ర్మ, అరుణోద‌య‌న్ త‌దిత‌రులు ఇత‌ర పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

ఇవి కూడా చదవండి

మోహ‌న్‌.జి, ప‌ద్మ చంద్రశేఖ‌ర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్‌, ఫిలిప్ ఆర్‌.సుంద‌ర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థ‌నికా టోని కొరియోగ్రఫీ, యాక్షన్ సంతోష్, ఎడిట‌ర్‌గా దేవ‌రాజ్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా క‌మ‌ల‌నాథ‌న్ బాధ్యత‌లు నిర్వహిస్తున్నారు. ఇది 14వ శ‌తాబ్దానికి చెందిన క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఆ స‌మ‌యంలోనే మొఘ‌ల్ చ‌క్రవ‌ర్తులు త‌మిళ‌నాడులోకి ప్రవేశించారు. ర‌క్తంతో రాసిన చ‌రిత్రాక ఘ‌ట‌నల ఆధారంగా సినిమా రూపొందుతోంది. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా నిలిచారు.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

ఈ సినిమా షూటింగ్‌లో 75శాతాన్ని ముంబైలో చేస్తున్నారు. మిగిలిన షూటింగ్‌ను సెంజి, తిరువ‌ణ్ణామ‌లై, కేర‌ళ‌ల‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన ద్రౌపతి సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందో అనే విషయం ప్రధానాంశంగా నిలుస్తోంది. ఇదే అనుసంధానం ద్వారా ఈ చిత్రం ద్రౌపతి సిరీస్‌లో రెండవ భాగంగా రూపొందుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది చివ‌ర‌లో భారీ ఎత్తున విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

Exit mobile version