Site icon Desha Disha

BiggBoss9Telugu : ‘అగ్నిపరీక్ష’ లో భారీగా పడిపోయిన ప్రసన్న కుమార్ ఓటింగ్..మొదటి రెండు స్థానాల్లో ఎవరు ఉన్నారంటే!

BiggBoss9Telugu : ‘అగ్నిపరీక్ష’ లో భారీగా పడిపోయిన ప్రసన్న కుమార్ ఓటింగ్..మొదటి రెండు స్థానాల్లో ఎవరు ఉన్నారంటే!

BiggBoss 9 Telugu : మరో వారం రోజుల్లో స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అందుకు కారణం సామాన్యులకు పెద్ద పీఠ వెయ్యడమే. ఇంతలా ఈ షో ని సక్సెస్ చేసి 8 సీజన్స్ విజయవంతంగా నడిపించిన ప్రేక్షకులకు మేము ఇచ్చుకునే చిరు కానుక అంటూ నాగార్జున చేత ప్రోమోలు చేయించి ఒక రేంజ్ లో హైప్ పెంచారు. అయితే ఈ సామాన్యులను ఎంపిక చేసుకునే ప్రక్రియ కోసం ‘అగ్ని పరీక్ష'(Agnipariksha) అనే షో ని నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. గత 6 రోజుల నుండి ప్రతీరోజు అర్థ రాత్రి 12 గంటలకు జియో హాట్ స్టార్ లో లేటెస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది.

45 మందికి ఆడిషన్స్ ని నిర్వహించి కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ 15 మందికి వివిధ టాస్కులను నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వీళ్ళను ప్రేక్షకుల చేత ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కల్పించారు. జియో హాట్ స్టార్ లో వీళ్లకు ఓట్లు వేయొచ్చు. మొదటి రోజు ఓటింగ్ లో ప్రసన్న కుమార్ అందరి కంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగాడు. కానీ రెండవ రోజు ఆయన ఆట తీరు జనాలకు నచ్చలేదు. దీంతో ఆయన ఓటింగ్ మూడవ స్థానానికి పడిపోయినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నిన్న ఆయన మంచిగానే ఆడాడు కానీ, సంచాలక్ దాలియా తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఆట నుండి వైదొలిగాడు. తన తప్పు లేకపోయినప్పటికీ కూడా ఆమె ఆట నుండి తొలగిస్తే కనీసం తన కోసం తానూ వాదించుకోలేదు. ఇదే ఆయనకు పెద్ద మైనస్ అయ్యింది.

ఆయన తరుపున టీం లీడర్ మర్యాద మనీష్ మాట్లాడాడే కానీ, ప్రసన్న కుమార్ మాత్రం నోరు మెదపలేదు. ఇంత మెతకగా ఉంటే బిగ్ బాస్ లో నెట్టుకొని రావడం కష్టం అనే అభిప్రాయం నిన్న ఈ షో ఎపిసోడ్ ని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. అందుకే ఆయన ఓటింగ్ శాతం తగ్గి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి అయితే ఆయన మూడవ స్థానం లో కొనసాగుతున్నాడట. మొదటి స్థానం లో పడాల పవన్ కళ్యాణ్, రెండవ స్థానం లో దమ్ము శ్రీజా కొనసాగుతున్నారు. నాల్గవ స్థానంలో ప్రియా శెట్టి, 5వ స్థానం లో మాస్క్ మ్యాన్ హరీష్ కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి టాప్ 5 వీళ్ళే, రాబోయే రోజుల్లో ఓటింగ్ శాతం బాగా పెరగొచ్చు.

Exit mobile version