Site icon Desha Disha

Betting Apps Ban : నాబెట్టింగ్ యాప్స్ బ్యాన్.. భారత క్రికెటర్లకు ఎంత నష్టమంటే?

Betting Apps Ban : నాబెట్టింగ్ యాప్స్ బ్యాన్.. భారత క్రికెటర్లకు ఎంత నష్టమంటే?

Betting Apps Ban : కేవలం భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక ఫీజు, ఇతర సౌలభ్యాల వల్ల మాత్రమే కాదు.. కమర్షియల్ యాడ్స్ లో నటించడం ద్వారా టీం ఇండియా క్రికెటర్లు భారీగా సంపాదిస్తుంటారు.. అందులో కొంతమంది క్రికెటర్ల సంపాదన బీభత్సంగా ఉంటుంది.. ఎందుకంటే వారు అంబాసిడర్లుగా వ్యవహరించే కంపెనీలు భారీగా ఇస్తుంటాయి.. అయితే ఈ జాబితాలో కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ కంపెనీలు భారత్ క్రికెటర్లలో కొంతమందికి కనివిని ఎరిగిన స్థాయిలో నజరానా ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కంపెనీలు మూతపడ్డాయి. వాటికి ప్రచారకర్తలుగా వ్యవహరించిన ఆదాయానికి గండి పడింది.

కేంద్రం నిర్ణయంతో..

ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను కేంద్రం ఇటీవల బ్యాన్ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం కూడా పెట్టారు. దీనివల్ల ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ అనేవి ఇకపై ఉండవు. వాటి ద్వారా జరిగే చీకటి వ్యాపారానికి కళ్లెం పడుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల దేశ యువత తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయడం వల్ల టీమ్ ఇండియా క్రికెటర్లు దాదాపు 200 కోట్ల వరకు నష్టపోతున్నారని తెలుస్తోంది. టీమిండియాలో రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా డ్రీం 11 కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మై 11 సర్కిల్ కు మహమ్మద్ సిరాజ్, గిల్, జైస్వాల్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.. ఎంపీఎల్ కు విరాట్ కోహ్లీ, విన్ జో కు మహేంద్ర సింగ్ ధోని అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా ఏడాదికి 200 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఈ యాప్స్ ఇప్పుడు రద్దు కావడంతో వీరికి వచ్చే ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి.

ఐపీఎల్ సమయంలో..

ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు ఐపీఎల్ సమయంలో విపరీతమైన ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయం గడచిన మూడు సంవత్సరాలుగా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా డ్రీమ్ 11 అయితే కనివిని ఎరుగని స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో డ్రీం 11 బాలీవుడ్ నటులతో కూడా ఓ కమర్షియల్ యాడ్ రూపొందించింది. ఐపీఎల్ సమయంలో ఈ సంస్థ భారీగానే దండుకున్నట్టు తెలుస్తోంది.. అయితే కేంద్రం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కు పాదం మోపడంతో ఇకపై ఈ సంస్థలు మనగడ సాగించలేవు. అన్నట్టు డ్రీమ్ 11 భారత క్రికెట్ జట్టు కు స్పాన్సర్ గా ఉండేది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్పాన్సర్షిప్ నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Exit mobile version