Desha Disha

Apple MacBook Air : మ్యాక్‌బుక్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్..

Apple MacBook Air : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ధర తగ్గింది. ఈ ఖరీదైన ల్యాప్ టాప్ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.

Apple MacBook Air : మ్యాక్‌బుక్ ఎయిర్ ధర భారీగా తగ్గిందోచ్..

Apple MacBook Air

Updated On : August 27, 2025 / 5:07 PM IST

Apple MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రత్యేకించి స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం భారీ తగ్గింపుతో (Apple MacBook Air) అందుబాటులో ఉంది. ఈ బెస్ట్ ల్యాప్‌టాప్‌ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్, క్రిస్టల్ క్లియర్, వైబ్రెంట్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ-లైఫ్, ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్ తో వస్తుంది.

మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తుంటే.. ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం స్పెషల్ డిస్కౌంట్‍తో అందుబాటులో ఉంది. తద్వారా రూ. 20,410 తగ్గింపుతో పొందవచ్చు.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్ :
13.3-అంగుళాల స్క్రీన్, ఆపిల్ M1 చిప్ మ్యాక్‌బుక్ ఎయిర్ క్రోమాపై రూ.20,410 తగ్గింపుతో లభిస్తుంది. ఫైనల్ ధర రూ.54,490కి తగ్గుతుంది. నెలకు రూ.2,565 ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ స్పేస్ గ్రే, గోల్డ్, సిల్వర్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 256GB స్టోరేజ్, 8GB ర్యామ్‌తో వస్తుంది.

Read Also : Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? శాంసంగ్, ఎల్‌జీ, షావోమీ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తారు!

కొంచెం ధర ఎక్కువ ఉన్న లేటెస్ట్ వెర్షన్‌ కోసం చూస్తుంటే 512GB స్టోరేజీ, M2 చిప్‌తో కూడిన ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ కూడా ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.1,09,900 ఖరీదు చేసే ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం రూ.89,994కి అమ్ముడవుతోంది. పాత ల్యాప్‌టాప్‌తో ఎక్స్చేంజ్ చేసి ల్యాప్‌టాప్ ధరను మరింత తగ్గించవచ్చు.

మ్యాక్‌బుక్ ఎయిర్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ M1 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ విషయానికి వస్తే.. పవర్‌ఫుల్ అల్ట్రా-పోర్టబుల్ ల్యాప్‌టాప్, 2020లో లాంచ్ కాగా కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 8-కోర్ CPUతో ఆపిల్ M1 చిప్, హై-రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేయడం నుంచి కంటెంట్‌ చూడటం వరకు వైడ్ రేంజ్ ప్రాసెసింగ్ స్పీడ్ అందిస్తుంది. M1 చిప్ పవర్ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం మన్నిక ఉండేలా ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు.

మ్యాక్‌బుక్ ఎయిర్ (macOS)పై రన్ అవుతుంది. ఆపిల్ (iPhones, iPads, Apple Watch)తో సులభంగా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. 13.3-అంగుళాల రెటినా డిస్‌ప్లే P3 వైడ్ కలర్ సపోర్ట్, రియలిస్టిక్ ఇమేజనరీ కోసం ట్రూ టోన్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఆపిల్ ఈ ల్యాప్‌టాప్‌ చాలా తేలికగా, పోర్టబుల్‌గా ఉంటుంది. కేవలం 1.29 కిలోల బరువుతో వస్తుంది.

Exit mobile version