ఆంధ్రప్రదేశ్ వైద్య, కుంటుంబ సంక్షేమ శాఖలో.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్‌ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానిక అవకాశం కల్పించింది.
పోస్టుల వివరాలు ఇవే..
- జనరల్ ఫిజీషియన్(టెలీ మెడిసిన్ హెచ్‌యూబీ) పోస్టులు: 13
- గైనకాలజిస్ట్(టెలీ మెడిసిన్ హెచ్‌యూబీ) పోస్టులు: 03
- పీడీయాట్రీషియన్(డీఈఐసీఎస్) పోస్టులు: 14
- మెడికల్ ఆఫీసర్ (యూపీహెచ్‌సీఎస్/ యూఏఏఎంఎస్/ డీఈఐసీఎస్/ టెలీ మెడిసిన్ హబ్స్) పోస్టులు: 155
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అలాగే APMCలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు, ఇతరులకు 50 నుంచి 52 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 10, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1000. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ పోస్టులకు రూ.1,10,000, పీడియాట్రిషియన్ పోస్టులకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.61,960 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.