Site icon Desha Disha

AP Rains: అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు – Telugu News | IMD forecasts heavy rain, thunderstorms in Andhra Pradesh till August 30

AP Rains: అల్పపీడనం ఎఫెక్ట్‌.. ఆ జిల్లాలకు కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు – Telugu News | IMD forecasts heavy rain, thunderstorms in Andhra Pradesh till August 30

అమరావతి, ఆగస్ట్‌ 27: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమవాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ రోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కువననున్నాయి. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఈ క్రమంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Exit mobile version