Site icon Desha Disha

Actress : ఇండస్ట్రీలో తోపు.. సినిమా ఆఫర్స్ లేక రేసర్‏గా మారిన హీరోయిన్.. ఎవరంటే.. – Telugu News | Do You Remember This Heroine Who is Famous In Tollywood, now She Is Car Racer, Her Name is Nivetha Pethuraj

Actress : ఇండస్ట్రీలో తోపు.. సినిమా ఆఫర్స్ లేక రేసర్‏గా మారిన హీరోయిన్.. ఎవరంటే.. – Telugu News | Do You Remember This Heroine Who is Famous In Tollywood, now She Is Car Racer, Her Name is Nivetha Pethuraj

తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో జనాలకు దగ్గరయ్యింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం కారు రేసుల్లో పాల్గొంటుంది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో తనకు నచ్చిన రంగాల్లో రాణిస్తుంది. అటు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కారు రేసుల్లో రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంది. చిన్నప్పటి నుంచి ఆటో మొబైల్స్ పై ఇష్టం ఉన్న ఈ అమ్మడు.. ఇటీవల ఫార్ములా కార్ రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రాం లెవల్ 1ని కంప్లీట్ చేసింది. ఇప్పటికే పలు పోటీల్లో పతకాలు గెలుచుకుంది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో అటు బ్యాడ్మింటన్, ఇటు కారు రేసింగ్ చేస్తుంది. ఇంతకీ ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ నివేదా పేతురాజ్.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ఇవి కూడా చదవండి

నివేదా పేతురాజ్.. ప్రస్తుతం దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటుతుంది. ముఖ్యంగా తన తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్ లో పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చివరగా తెలుగులో పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు ఈ సిరీస్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

అయితే కారు రేసుల్లో నివేదా మాత్రమే కాదు.. ఆమె సోదరుడు సైతం పాల్గొంటున్నాడు. ఒక్కో కారు రేసులో పాల్గొనాలంటే దాదాపు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని.. అలాగే ఎంతో ప్రాక్టీస్ చేసిన వారతైనే ఇందులో గెలుపు ఉంటుందని గతంలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

Exit mobile version