విశాలాంధ్ర – నిడదవోలు : విద్యా, వైద్యం వంటి సామాజిక సేవలతోపాటు వ్యక్తిగత అత్యవసర సేవలు అందించడంలోను రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని క్లబ్ అధ్యక్షులు పైడి సురేష్,కార్యదర్శి నల్లూరి చంద్ర కిరణ్ అన్నారు. నిడదవోలు వాస్తవ్యురాలు సూరిశెట్టి తులసి ఆర్థికంగా వెనుకబడి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యం ఖర్చులు లేక ఆర్థిక ఇబ్బందులు గురవుతుంది. విషయం తెలుసుకున్న రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ సభ్యుల ఆర్థిక సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం ₹20,000/-లు తులసికి అందజేశారు. తులసి క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో అధ్యక్షులు పైడి సురేష్,కార్యదర్శి నల్లూరి చంద్ర కిరణ్,కోశాధికారిగోనెల వీర వెంకట సత్యనారాయణ, బి ఎన్ వి ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.
