Site icon Desha Disha

వరదల్లో 1071 మందిని రెస్క్యూ చేశాం : తెలంగాణ CMO

వరదల్లో 1071 మందిని రెస్క్యూ చేశాం : తెలంగాణ CMO
వరదల్లో 1071 మందిని రెస్క్యూ చేశాం : తెలంగాణ CMO

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 1071 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడినట్టు తెలంగాణ సీఎంవో ప్రకటన జారీ చేసింది. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో 1000 మందికి ఆహార పదార్థాలు అందజేసినట్టు పేర్కొంది. ఈ సహాయక చర్యల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్థానిక పోలీసు బృందాలు పాల్గొన్నట్టు తెలిపింది. అలాగే కొన్నిచోట్ల వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు అందజేసినట్టు వెల్లడించింది. కామారెడ్డి, మెదక్, ఖమ్మం వంటి తీవ్ర వరద ప్రభావిత జిల్లాల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయని తెలంగాణ సీఎంవో పేర్కొంది.

Exit mobile version