Site icon Desha Disha

యూరిక్ యాసిడ్.. కీళ్ల నొప్పి మాత్రమే కాదు..! ఈ కొత్త లక్షణాలు కూడా కనిపిస్తాయి..! – Telugu News | Top Signs of Uric Acid Problem in Your Body

యూరిక్ యాసిడ్.. కీళ్ల నొప్పి మాత్రమే కాదు..! ఈ కొత్త లక్షణాలు కూడా కనిపిస్తాయి..! – Telugu News | Top Signs of Uric Acid Problem in Your Body

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి లేదా వ్యాయామం చేయకపోవడం. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు అది రక్తంలో పేరుకుపోయి.. కీళ్లలోకి చేరి నొప్పి, వాపు వంటి ఇబ్బందులను కలిగిస్తుంది.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు

  • కీళ్ల నొప్పి, వాపు.. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే దాని ప్రభావం మొదట కీళ్లపై కనిపిస్తుంది. మోకాళ్లు, పాదాల వేళ్లు, చేతి మణికట్టు వంటి చోట్ల నొప్పి, వాపు వస్తాయి. దీన్ని గౌట్ అని అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారవచ్చు.
  • మూత్రం రంగులో మార్పు.. సాధారణంగా మూత్రం పల్చగా, లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే మూత్రం ముదురు రంగులోకి లేదా మబ్బులా మారవచ్చు. ఇది మీ శరీరం ఎక్కువ యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తోందని సూచిస్తుంది.
  • ఆకలి తగ్గడం.. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని వల్ల మీకు ఆకలి వేయకపోవడం లేదా తినాలనిపించకపోవడం జరుగుతుంది. దీని వల్ల శరీరం బలహీనంగా మారవచ్చు.
  • చర్మ సమస్యలు.. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది కీళ్లకే కాకుండా చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. చర్మం ఎర్రగా మారడం, దురద లేదా చిన్న చిన్న మంటలు రావచ్చు. ఇది శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని సూచించవచ్చు.
  • మూత్ర సంబంధిత సమస్యలు.. కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను పూర్తిగా ఫిల్టర్ చేయలేకపోతే మూత్ర విసర్జనలో సమస్యలు వస్తాయి. తరచుగా మూత్రం పోవాలనిపించడం లేదా మూత్రం సరిగా రాకపోవడం లాంటి ఇబ్బందులు కనిపించవచ్చు.
  • మీకు ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ చెప్పిన ఆహారం, మందులు, జీవనశైలి మార్పులను పాటించడం చాలా ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

[

Exit mobile version