Site icon Desha Disha

మొదలైన 'ఓజీ' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..'కల్కి','పుష్ప 2' రికార్డ్స్ అవుట్!

మొదలైన 'ఓజీ' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..'కల్కి','పుష్ప 2' రికార్డ్స్ అవుట్!

మొదలైన 'ఓజీ' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..'కల్కి','పుష్ప 2' రికార్డ్స్ అవుట్!

OG overseas advance bookings: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని నేడు వినాయక చవితి సందర్భంగా నార్త్ అమెరికా లో రెండు థియేటర్స్ కి ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. సినీ మార్క్ డల్లాస్ XD అండ్ ఐమాక్స్ థియేటర్ లో ఏకంగా 38 షోస్ ని షెడ్యూల్ చేశారు. ఈ షోస్ నుండే 50 వేల డాలర్లు వచ్చాయట. దాదాపుగా 2000 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఆస్టిన్ లో రెండు షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా అవి కూడా అమ్ముడుపోయాయి.

మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన రెండు థియేటర్స్ నుండి కొద్ది గంటల్లోనే ఈ చిత్రానికి 60 వేలకు పైగా డాలర్స్ వచ్చాయి. ఈ రేంజ్ ట్రెండ్ ‘కల్కి’,’దేవర’ మరియు ‘పుష్ప 2’ చిత్రాలకు కూడా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘దేవర’ చిత్రానికి ఆరంభం లో 19 లొకేషన్స్ లో 52 షోస్ షెడ్యూల్ చేస్తే వాటి నుండి 75 వేల డాలర్లు వచ్చాయి. అదే విధంగా కల్కి కి వందకి పైగా షోస్ ని షెడ్యూల్ చేయగా ఆరంభం లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘ఓజీ’ చిత్రానికి కేవలం రెండు థియేటర్స్ నుండే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే 29 వ తారీఖున పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు లోపు ఈ చిత్రానికి హాఫ్ మిలియన్ కి పైగా డాలర్లు వస్తాయని. అదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఈ చిత్రం కల్కి (3.9 మిలియన్) ప్రీమియర్ షో రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కల్కి,దేవర చిత్రాలకు నార్త్ అమెరికా వ్యాప్తంగా ఐమాక్స్ షోస్ భారీ గా షెడ్యూల్ అయ్యాయి. కానీ ఓజీ చిత్రానికి ఐమాక్స్ షోస్ షెడ్యూల్ అవ్వడం ప్రస్తుతానికి అయితే అనుమానమే అని అంటున్నారు మేకర్స్. దీని మీద పూర్తి సమాచారం సెప్టెంబర్ 10 లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఐమాక్స్ షోస్ కూడా షెడ్యూల్ చేస్తే ఓజీ చిత్రం ఆల్ టైం రికార్డు కచ్చితంగా నెలకొల్పుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Exit mobile version