Site icon Desha Disha

భారత్‌పై అమల్లోకి వచ్చిన 50 శాతం సుంకాలు.. ఆ రంగాలపై తీవ్ర ప్రభావం

భారత్‌పై అమల్లోకి వచ్చిన 50 శాతం సుంకాలు.. ఆ రంగాలపై తీవ్ర ప్రభావం
భారత్‌పై అమల్లోకి వచ్చిన 50 శాతం సుంకాలు.. ఆ రంగాలపై తీవ్ర ప్రభావం

దిశ, వెబ్‌డెస్క్: రష్యా (Russia) నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్న భారత్‌ (India)పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా (America) విధించిన ప్రతికార సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఇక భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి వస్తువుపై 50 శాతం సుంకం విధించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి పీఠం ఎక్కిన తర్వాత భారత్‌తో వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది. అయితే, ప్రతీకార సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. 50శాతం సుంకాలు అమెరికాకు ఎగుమతి అయ్యే 48.2 బిలియన్ విలువైన వస్తువులపై ప్రభావం చూపనున్నాయి. కొత్త సుంకాలు బుధవారం ఉదయం 9.30 గంటలకు అమలులోకి వచ్చినట్లుగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (US Department of Homeland Security) ఒక డ్రాఫ్ట్ ఆర్డర్‌లో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 25న భారతదేశానికి రానున్న అమెరికా ప్రతినిధి బృందం సందర్శన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 7 నుంచి అమెరికా నిర్దిష్ట భారతీయ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని అమలు చేసింది. అదనంగా భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చేయడం వల్ల బుధవారం నుంచి 25 శాతం అదనపు సుంకం కూడా అమలులోకి వచ్చింది.

కాగా, 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 86 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రతికార సుంకంలో భాగంగా టెక్స్‌టైల్స్, రొయ్యలు, లెదర్, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు చేసే వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులకు సుంకం మినహాయింపులు యథావిధిగా కొనసాగుతాయి. తిరుప్పూర్, నోయిడా, సూరత్‌లలోని టెక్స్‌టైల్, దుస్తుల తయారీ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. తయారీదారులు వియత్నాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చే పోటీదారులతో వారు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు.

Exit mobile version