Site icon Desha Disha

పేదవాడి కి పట్టేడు అన్నం పెట్టడం ప్రభుత్వ ధ్యేయం

పేదవాడి కి పట్టేడు అన్నం పెట్టడం ప్రభుత్వ ధ్యేయం

విశాలాంధ్ర – గోపాలపురం : పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సముదాయముల ఆవరణములో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే భూమి పూజ చేసి లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న గోపాలపురం నందు కేవలం రూ 5 రూపాయలకే పేదవాని ఆకలి తీర్చి ఆనాటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు యొక్క ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని వారి భుజస్కంధల మీద వేసుకొని ప్రతి శుక్రవారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ పట్ల వారికున్న ప్రేమను చాటుకున్నారన్నారు. రూ 61 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ అన్నా క్యాంటీన్ ను నాలుగు నెలల కాలంలో నిర్మించేందుకు గుత్తేదారు ముందుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు భాగంగా అవసరమైన ప్రతి చోట అన్న క్యాంటీన్ నిర్వహించి పేదల ఆకలి తీర్చటం తమ ఉద్దేశం అన్నారు. ప్రధాన సెంటర్లో నిర్మించే ఈ అన్నా క్యాంటీన్ కు వారాంతపు సంత కు వచ్చే కూలీలు మరియు హాస్పిటల్ కు వచ్చి రోగులు సైతం ఈ క్యాంటీన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డిగండ్ల సువర్ణ రాజు, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు గల్లా శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ మనోహర్, తహసిల్దార్ సాయిప్రసాద్, తెదేపా మండల పార్టీ అధ్యక్షులు కొర్లపాటి రాము, గోపాలపురం చెరుకుమిల్లి సొసైటీ అధ్యక్షులు వడ్లమూడి రమేష్ గద్దె హరిబాబు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామ తులసి, తెదేపా సీనియర్ నాయకులు కొర్లపాటి అన్నవరం, నీటి సంఘం అధ్యక్షులు కోడూరి రఘురాం, మద్దిపాటి రాజేష్, నూతంగి దొరబాబు, నందమూరి సత్యనారాయణ, జేష్ట శ్రీనివాసరావు, జేష శ్రీధర్, బురెడ్డి వాసు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Exit mobile version