Site icon Desha Disha

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్: అబుదాబిలో ఒకే వేదికను పంచుకున్న ప్రపంచ అగ్రగామి మహిళలు – Telugu News | News9 Global Summit: Women leaders take centre stage in Abu Dhabi UAE

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్: అబుదాబిలో ఒకే వేదికను పంచుకున్న ప్రపంచ అగ్రగామి మహిళలు – Telugu News | News9 Global Summit: Women leaders take centre stage in Abu Dhabi UAE

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ యుఎఇ రెండవ ఎడిషన్ బుధవారం (ఆగస్టు 27) అబుదాబిలో అట్టహాసంగా జరిగింది. వివిధ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు తమ అంతర్దృష్టిని చాటుకున్నారు. మహిళా సాధికారత- సమ్మిళిత స్ఫూర్తిపై కేంద్రీకృతమై ఉన్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ SHEconomy ఎజెండాకు TV9 నెట్‌వర్క్ MD మరియు CEO బరుణ్ దాస్ ప్రారంభ ఉపన్యాసంతో కనుల పండుగగా సాగింది.

నేటి సమాజం అన్ని రంగాలలో మేధోపరమైన మహిళల ఆధిపత్యంతో నడుస్తుంది. మహిళలు అనేక రంగాల్లో రాణిస్తునప్పటికీ, ఇంకా చాలా సాధించాల్సి ఉంది. వ్యాపారం, రాజకీయాలు, సినిమా, సంగీతం వరకు ఎనలేని కృషీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అబుదాబిలో మహిళా మార్పుకు కారణమైన వారిని ఘనంగా సత్కరించుకుంది. అబుదాబిలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ – యుఎఇ ఎడిషన్ SHEconomy అజెండా అనే థీమ్‌తో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం మహిళలు ఇకపై అభివృద్ధిలో భాగం మాత్రమే కాదు.. వారు ప్రగతిరథాన్ని నడిపిస్తున్నారు. ఎమిరాటి మహిళా దినోత్సవానికి ముందే, ఈ శిఖరాగ్ర సమావేశం సాధికారత-చేరిక కోసం స్వరాన్ని పెంచింది. దీనిని లామర్ క్యాపిటల్ నిర్వహించింది. షున్యా డాట్ AI, FICCI, IPF, GCC వారి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ క్లబ్ కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

TV9 నెట్‌వర్క్ MD మరియు CEO బరుణ్ దాస్ ప్రారంభోపన్యాసం చేస్తూ, విభిన్న స్వరాలతో నడిచే ప్రపంచ సంభాషణలకు వేదికలను సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా వీడియో సందేశం ద్వారా పాలనా సంస్కరణలతో మహిళల నాయకత్వాన్ని అలవర్చుకుంటున్నారన్నారు. యుఎఇలో భారత రాయబారి సంజయ్ సుధీర్, దౌత్యం భారతదేశం-యుఎఇ సంబంధం వంటి సమ్మిళిత భాగస్వామ్యాలను ఎలా బలపరుస్తుందో వివరించారు.

బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో నటి రిచా చద్దా ఒక ఆసక్తికరమైన సంభాషణలో పాల్గొన్నారు. అక్కడ ఆమె SHEstar సినిమా అవార్డుతో సత్కరించబడటానికి ముందు తన సినిమా ప్రయాణం గురించి వివరించారు. గాయని సోనా మహాపాత్ర కూడా స్ఫూర్తిదాయకమైన సంభాషణలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆమె కళలు, క్రియాశీలతకు SHEstar సంగీత అవార్డును అందుకున్నారు.

మన్ దేశీ ఫౌండేషన్‌కు చెందిన చేత్నా గాలా సిన్హా, జెట్‌సెట్‌గోకు చెందిన కనికా టేక్రివాల్, ఫ్రాంటియర్ మార్కెట్స్‌కు చెందిన అజైతా షా, డాక్టర్ సువాద్ అల్ షంసీ, డాక్టర్ సోనాలి దత్తా వంటి మహిళా వ్యవస్థాపకులు, వ్యాపార దిగ్గజాలను అనేక ప్యానెల్‌లు ఒకచోట చేర్చాయి. ఆవిష్కరణ, పట్టుదల, దృక్పథం పరిశ్రమలను ఎలా పునర్నిర్వచించగలవో వారు పంచుకున్నారు.

లామర్ క్యాపిటల్‌కు చెందిన అంకుర్ అట్రే, గెయిల్‌కు చెందిన ఆయుష్ గుప్తా వంటి నాయకులు సంపద సృష్టి, వారసత్వం, సమ్మిళిత కార్యాలయాలపై మాట్లాడారు. కుటుంబ వ్యాపార నాయకులు లావణ్య నల్లి, షఫీనా యూసుఫ్ అలీ, డాక్టర్ సనా సాజన్, డాక్టర్ జీన్ షాహదాద్‌పురి మహిళలు ఆధునిక వ్యూహాలతో సాంప్రదాయ సంస్థలను ఎలా పునర్నిర్మిస్తున్నారో చర్చించారు.

ఈ సాయంత్రం హైలైట్ SHEstar అవార్డ్స్. ఇది విభిన్న రంగాలలోని సాధకులను సత్కరించుకోవడం జరిగింది. ఏవియేషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, సోషల్ ఇంపాక్ట్, CSR, STEM, ఆర్టిసానల్ ఎకానమీ, లా, పర్వతారోహణ, కళలు వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన స్త్రీమూర్తులను ఘనం సత్కరించుకోవడం జరిగింది. అవార్డు గ్రహీతలలో కనికా టేక్రివాల్, అజైతా షా, షఫీనా యూసఫ్ అలీ, లావణ్య నల్లి, చెత్నా గలా సిన్హా, డాక్టర్ సనా సజన్, డాక్టర్ సువాద్ అల్ షమ్సీ, నైలా అల్ బలూషి, అడ్వకేట్ బిందు చెట్టూర్, సోనా మోహపాత్ర ఉన్నారు.

మహిళలు నేతృత్వంలోని వృద్ధి విజయవంతమైన వేడుకను సూచిస్తూ.. ప్రపంచ SHEconomy సంభాషణకు వేదికను ఏర్పాటు చేస్తూ, స్పీకర్లు, అవార్డు గ్రహీతలు, భాగస్వాముల సమూహ ఫోటోతో శిఖరాగ్ర సమావేశం ముగిసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Exit mobile version