Site icon Desha Disha

‘ఢీ 20’ కి హీరోయిన్ రెజీనా ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్

‘ఢీ 20’ కి హీరోయిన్ రెజీనా ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్

Regina Remuneration for Dhee20: హీరోయిన్ గా కెరీర్ లో గుర్తించుకోదగ్గ సినిమాలు కొన్ని చేసినప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయిన వారిలో ఒకరు రెజీనా కాసాండ్రా(Regina Cassandra). ఇప్పటి వరకు ఆమె కుర్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది కానీ, పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కలేదు. కొత్త హీరోయిన్స్ రాకతో ఆమె అడపాదడపా వచ్చే హీరోయిన్ రోల్స్ కూడా రావడం ఆగిపోయాయి. దీంతో పవర్ ఫుల్ క్యారక్టర్ రోల్స్ చేసే అవకాశం వచ్చినా వదులుకోలేదు. ఈ క్రమం లోనే ఆమె ఈమధ్య కాలం లో చాలా లేడీ విలన్ క్యారెక్టర్స్ చేసింది. 7, ఎవరు, చక్ర, విడాముయార్చి మరియు జాట్ వంటి చిత్రాల్లో ఆమె లేడీ విలన్ క్యారెక్టర్స్ చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. అలా ఇప్పుడు ఆమె పాన్ ఇండియా లెవెల్ లో లేడీ విలన్ గా మంచి డిమాండ్ తో కొనసాగుతుంది.

కెరీర్ పరంగా ఆ రేంజ్ బిజీ తో ఉన్నప్పటికీ కూడా ఆమె ఈటీవీ లో ప్రతి బుధ, గురువారాల్లో ప్రసారమయ్యే ‘ఢీ 20’ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి ఒప్పుకుంది. రీసెంట్ గానే మొదలైన ఈ షో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఈ షో కి రెజీనా కాసాండ్రా కొత్త గ్లామర్ ని యాడ్ చేసింది. ఆమె జడ్జిమెంట్ కూడా చాలా క్లారిటీ తో ఇస్తుంది. స్క్రిప్టెడ్ లాగా అసలు అనిపించలేదు. ఇంత ఆర్గానిక్ జడ్జిమెంట్స్ గత సీజన్స్ లో వచ్చిన హన్సిక ఇవ్వలేకపోయింది అని అంటున్నారు నెటిజెన్స్. అయితే ఒక్కో ఎపిసోడ్ కి రెజీనా కాసాండ్రా తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈమె ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట.

దాదాపుగా గత సీజన్స్ లో ప్రియమణి కి ఇచ్చినంత రెమ్యూనరేషన్ ఈమెకు కూడా ఇస్తున్నారట. మరి ట్రెండింగ్ ఉన్న హీరోయిన్స్ ఇలాంటి షోస్ కి జడ్జీలుగా రావాలంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది కదా అని అంటున్నారు విశ్లేషకులు. ఈ షోలో ఆమె తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ ని విజయ్ బెన్నీ మాస్టర్ అందుకుంటున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కి ఆయన నాలుగు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటాడట. అదే విధంగా హైపర్ ఆది మూడు లక్షల రూపాయిలు, రీసెంట్ గానే ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మముడి ఫేమ్ దీపికా రెండున్నర లక్షలు, యాంకర్ నందు మూడు లక్షల రూపాయిలు ఒక్కో ఎపిసోడ్ కి రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట. ఈ రేంజ్ రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారంటే ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version