డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఈ 3 పండ్ల జ్యూస్‌‌లు మర్చిపోయి కూడా తాగకండి.. ఎందుకంటే.. – Telugu News | High Blood Sugar? Skip These 3 Juices If You Have Diabetes

ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహరపు అలవాట్లే దీనికి కారణమని పేర్కొంటున్నారు. అయితే.. డయాబెటిస్ రోగులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిజానికి, ఆహారంలో ఒక చిన్న పొరపాటు కూడా రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అధిక చక్కెర స్థాయి కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అటువంటి పరిస్థితిలో, డయాబెటిస్ రోగులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చాలా సార్లు డయాబెటిస్ రోగులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు, దీని కారణంగా వారి చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు కొన్ని పండ్ల రసాలను తాగకూడదు. ఈ జ్యూస్‌లను తాగడం ద్వారా, చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ రోగులు ఏ పండ్ల రసాలను తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరెంజ్ జ్యూస్: ఆరెంజ్ జ్యూస్‌ను తయారు చేసుకుని తాగకూడదు. నారింజను జ్యూస్ గా కాకుండా ఎల్లప్పుడూ తినడం అలవర్చుకోవాలి. నిజానికి, నారింజ పండులో ఫైబర్ ఉంటుంది.. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నారింజ రసం తాగడం వల్ల చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు తమ ఆహారంలో నారింజను చేర్చుకోవచ్చు, కానీ నారింజ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరిగి హాని కలిగించే అవకాశం ఉంది.

పైనాపిల్ జ్యూస్: పైనాపిల్ రసం కూడా తాగకూడదు. పైనాపిల్‌ను ముక్కలుగా తినాలి. పైనాపిల్ రసం తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు ఒకటి లేదా రెండు పైనాపిల్ ముక్కలు తినవచ్చు.. కానీ పైనాపిల్ రసం తాగడం వల్ల వారి ఆరోగ్యానికి హానికరం..

ఆపిల్ జ్యూస్: డయాబెటిస్ రోగులు ఆపిల్ రసం కూడా తాగకూడదు. ఆపిల్ రసం తాగడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు తమ ఆహారంలో ఆపిల్‌ను చేర్చుకోవడం మంచిది.. అయితే.. డయాబెటిస్ రోగులు ఎల్లప్పుడూ ఆపిల్‌ను ముక్కలుగా కోసుకోని లేదా పండును నేరుగా తినవచ్చు. కానీ దాని రసం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని డైటీషియన్లు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Leave a Comment