ట్రాఫిక్ అయినా తప్పని పరిస్థితి

మెయిన్ రోడ్ లో దుస్థితి పై దృష్టి సారించండి
విశాలాంధ్ర – తాళ్లపూడి: ఉన్నది ఒకటే మార్కెట్, ఏళ్ల తరబడి చవితి కానీ శ్రావణ శుక్రవారం కానీ జనవరి ఫస్ట్ కానీ ఏ పండుగ రోజులు వచ్చినా చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు తాళ్లపూడి మెయిన్ రోడ్ లో గల బస్టాండ్, లక్ష్మీ దేవి గుడి సెంటర్ కి పెద్ద గుర్తింపు. చుట్టూ పక్కల నుండి అమ్ముకునే వాళ్ళు ఇక్కడకే వస్తారు, కొనే వాళ్లకు ఇదే సెంటర్. కానీ ఇక్కడున్న ప్లేస్ మాత్రం ఒకప్పుడు పెద్దది కానీ ఇప్పుడు చిన్నది. బస్టాండ్ నుండి చేపల మార్కెట్ వరకు ఇరువైపులా ఆక్రమణలు. వీటిని అడిగే నాధుడు ఉండడు. ట్రాఫిక్ ఇబ్బంది అని మీడియా కానీ, ప్రజలు కానీ ఆడిగినపుడు మాత్రం పోలీస్ వెంటనే రంగం లోకి దిగుతారు. ఇక్కడ ఈ పరిస్థితి కారణం ఏమిటి? శాశ్వత పరిష్కారం ఏమిటి? అన్న విషయాలు ఏ ఒక్కరు పరిగణ లోకి తీసుకోరు. ఆర్ అండ్ బి, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ ఇన్ని శాఖలు కలిసి ఆలోచిఅధి కానీ పరిష్కారం వుండదన్నది నిర్వివాదాంశం. ఇంత ఇరుకైనప్పటికి పండగలు సమయం లో ఏదో ఆర్దుకు పోవటం తప్ప మర్నాడు దీని వూసు ఉండదు. ఈ సమయం లో మాత్రం ఆర్టీసీ బస్ లు, కార్ లు, బైక్ లు నడిచే వాళ్ళు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ ట్రాఫిక్ లో అనేక సార్లు ఎమ్మెర్జన్సీ వెహికల్స్ కూడా ఇరుక్కున్న పరిస్థితి ఎదుర్కొన్నారు. ఏ ఒక్కరి స్వంత సమస్య కాదు కాబట్టి ట్రాఫిక్ పై ఒక్క పిర్యాదు కూడా అధికారులకు వెళ్లదు. ప్రజా ప్రయోజనం కొరకు కనీస చర్యలు అయినా అధికారులు చేపట్టాల్సివుంది.

The post ట్రాఫిక్ అయినా తప్పని పరిస్థితి appeared first on Visalaandhra.

Leave a Comment