Site icon Desha Disha

కిడ్నీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని చెప్పే ముఖ్యమైన లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! – Telugu News | How to Spot Kidney Disease Early on Face

కిడ్నీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని చెప్పే ముఖ్యమైన లక్షణాలు.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..! – Telugu News | How to Spot Kidney Disease Early on Face

కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ.. వ్యర్థాలను బయటికి పంపే ముఖ్యమైన అవయవాలు. అయితే కిడ్నీలు సరిగా పని చేయడం మానేస్తే.. దాని లక్షణాలు ముందుగా ముఖంపైనే కనిపించవచ్చు. ఈ సంకేతాలను ముందుగానే గుర్తిస్తే.. త్వరగా చికిత్స తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ళ చుట్టూ వాపు

ఉదయం లేవగానే కళ్ళ కింద లేదా ముఖంపై వాపు కనిపిస్తే అది కిడ్నీలు బలహీనపడటానికి సంకేతం కావచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో నీరు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

కళ తప్పిన ముఖం

కిడ్నీలు పని చేయడం తగ్గితే శరీరంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా తయారవుతాయి. దీని వల్ల రక్తహీనత ఏర్పడి.. ముఖం కళ తప్పి కనిపిస్తుంది.

డార్క్ సర్కిల్స్

కిడ్నీ సమస్యలు ఉన్న వారికి తరచుగా అలసట, నిద్రలేమి ఉంటాయి. దాని ప్రభావం కళ్ళ కింద నల్లటి వలయాలుగా కనిపిస్తుంది.

పొడి చర్మం 

కిడ్నీ సమస్యలు ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ వస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారడం, పెదవులు పగుళ్లు రావడం జరుగుతుంది.

ఎర్రటి మచ్చలు, దద్దుర్లు

కిడ్నీలు వ్యర్థాలను తొలగించకపోతే.. అవి రక్తంలో పేరుకుపోతాయి. దాని వల్ల ముఖంపై ఎర్రటి మచ్చలు లేదా దద్దుర్లు రావచ్చు.

ముఖం వాపు, బరువు పెరగడం

కారణం లేకుండా ముఖం ఉబ్బినట్లు కనిపించడం లేదా బరువు అకస్మాత్తుగా పెరగడం అనేది శరీరంలో నీరు పేరుకుపోయిందని సూచిస్తుంది. ఇది కిడ్నీ సమస్యలకు ఒక సూచన కావచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే వాటిని తేలికగా తీసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. ప్రతి సంవత్సరం ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యలను మొదట్లోనే గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

[

Exit mobile version